Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తనకు ఓటు వేస్తేనే బిల్లులు మంజూరు చేస్తానంటున్న బిఆర్ఎస్ అభ్యర్థి..?

బీఆర్ఎస్ కు భారీ షాక్

-బీఆర్ఎస్ కీలక నేత మంద సాంబయ్య 100 మందితో కాంగ్రెస్ లో చేరిక

-కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా
ఆగష్టు 28 నిజం చెపుతాం
మొగుళ్లపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేత 100 మంది తన అనుచరులతో కాంగ్రెస్ గూటికి చేరారు.

సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంద సాంబయ్య తన అనుచరులతో టీపీసీసీ మెంబర్..కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా..గండ్ర సత్యనారాయణ రావు వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ..ఆ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నానని, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన స్వలాభం కోసం పార్టీ మారి ప్రజల మనోభావాలను దెబ్బతీశాడని, అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచ్ లు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకుండా అడ్డుకుంటూ..తనకు ఓటు వేస్తేనే బిల్లులు మంజూరు అవుతాయని హుకుం జారీ చేయడాన్ని

ఆయా గ్రామాల సర్పంచ్ లు వ్యతిరేకిస్తున్నారని, త్వరలోనే భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులంతా ముకుమ్మడిగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని, తనతో సంప్రదింపులు జరుపుతున్నారని గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి, మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మల్సాని రాజేశ్వర్ రావు, నాయకులు ఎండి రఫీ, నీరటి మహేందర్, మండల రవీందర్, చిలుకూరి దేవేందర్ రెడ్డి, ఓనపాకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.