Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిస్సి హరిణి కి జాతీయ సేవా రత్న పురస్కారం

మధిర ఆగస్టు 28 (నిజం చెబుతాం న్యూస్)

మధిర రెస్క్యూ టీం అనే సంస్థను స్థాపించి కరోనా టైం లో ఎన్నో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి రోడ్లమీద బిక్షటన చేస్తూ చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తూ ఆదరణ సేవా ఫౌండేషన్ వృద్ధుల ఆశ్రమాన్ని స్థాపించి

ఎంతోమంది వృద్ధులకు సేవ చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ఖమ్మం జిల్లా తెలంగాణ మధిరకు చెందిన నిస్సి హరిని సామాజిక సేవకురాలు పేద ప్రజల కోసం సేవ చేస్తున్న ఆమె జాతీయ సేవ రత్న పురస్కారం అందుకున్నారు

కె. బి. ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఆదివారం గుంటూరు లోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ లో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో

జాతీయ సేవ రత్న పురస్కారాన్ని నిస్సి హరిని కు ఎమ్మెల్సీ, లేళ్ళ అప్పిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ హెూమ్ మినిస్టర్ మేకపాటి సుచరిత్ర, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు,

మద్దాలి గిరిధర్ రావు, గుంటూరు డిప్యూటీ మేయర్, షేక్ సజీల నిర్వాహకులు రంజిత్ కుమార్, కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొడవటికంటి రాజు, ఏఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలరాజు, అందించారు