రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యం
బోనకల్ : ఆగస్టు 27( నిజం చెబుతాం న్యూస్ ).
కల్తీ అన్ని రూపాలలో మానవాళిని కబళిస్తూ ఉంది, ఉప్పు పప్పు లాంటి నిత్యావసర సరుకులే కాదు బియ్యం కూడా కల్తీ జరుగుతోంది,
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజల ఆహార సేకరణలో బియ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది, అటువంటి బియ్యాన్ని కల్తీ రాయుల్లు వదలడం లేదు,
వివరాలు ఇలా ఉన్నాయి మండలంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యంలో బియ్యాన్ని పోలిన ప్లాస్టక్ బియ్యం కల్తీ జరుగుతుందని కలకోట సర్పంచ్ యంగల దయమణి అన్నారు,
అధికారులు ఈ కల్తీని నిరోధించి పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలన్నారు, ముఖ్యంగా ఈ బియ్యాన్ని పేదలు నిరుపేదలు పనిచేసుకునే వారు ఎక్కువగా తినటం జరుగుతుందని ఈ బియ్యం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆమె అన్నారు,
రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం దారిద్య రేఖకు దిగువన ఉన్న పేద నిరుపేద కుటుంబాలకు నెలల వారీ రేషన్ షాపులు ద్వారా పంపిణీ చేస్తూ ఉంటుంది,
ఈ పంపిణీ ఆహార నిల్వలు గిడ్డంగుల నుంచి సంబంధిత మండలాల కేటాయింపు ద్వారా ఆయా గ్రామాల రేషన్ షాపులకు చేరుకుంటుంది,
ఆహార భద్రత కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారునికి తక్కువ ఖర్చుతో ప్రభుత్వం పంపిణీ చేస్తుందని,ఈ బియ్యంలోనే బియ్యాన్ని పోలిన ప్లాస్టిక్ బియ్యం కనబడటం ప్రజలను ఆందోళన గురిచేస్తుంది
మండలంలోని కలకోట గ్రామపంచాయతీలోని ప్రభుత్వం ద్వారా గత నెల రేషన్ షాప్ నుండి పంపిణీ చేయబడిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కనబడ్డాయి అని అవి అచ్చం ఒరిజినల్ బియ్యం పోలి ఉండటం వలన గమనించటం కొంచెం కష్టం అయినా తేలికగా గుర్తించానని అన్నారు,
రొట్టెల పిండి కోసం అని బియ్యం నానబెట్టిన సందర్భంలో బియ్యంలో గల ప్లాస్టిక్ బియ్యం ఉబ్బి తేడాగా ఉండటాన్ని గమనించి వాటన్నింటినీ వేరుచేసి ఓ పాత్రలో వేసి పరిశీలించి చూడగా అవి ప్లాస్టిక్ బియ్యం అని తేలింది,
వాటిని చూసి ఆందోళన చెందామని ఇవి ఎలా కలుస్తున్నాయో తెలియదు కానీ అచ్చం బియ్యంలా ఉన్న ఈ ప్లాస్టిక్ బియ్యం వలన ప్రజలు అనారోగ్యం బారినపడతారన్నారు,
అధికారులు బియ్యాన్ని తనిఖీ చేయడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలన్నారు,రేషన్ షాపులు ద్వారా పంపిణీ కాబడే బియ్యం పట్ల అప్రమత్తంగా ఉండి కల్తీ లేని బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేయాలని ఆమె అన్నారు