సర్వేల ఆధారంతోనే ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు అధిష్టానం టికెట్ కేటాయింపు
మండల పార్టీ అధ్యక్షుడు ఏమి రెడ్డి జైపాల్ రెడ్డి!! మాడ్గుల ఆగష్టు 27( నిజం చెపుతాం ): మాడ్గుల మండల కేంద్రంలోని సర్పంచ్ అంబళ్ళ జంగయ్య గౌడ్ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు ఏమి రెడ్డి జైపాల్ రెడ్డి మాట్లాడుతు అధిష్టానం నిర్వహించిన అన్ని సర్వేల ఆధారాలతోనే ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు అధిష్టానం బీఫామ్ కేటాయించిందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతు బాలాజీ సింగ్ ఠాగూర్ శనివారం మాడుగుల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై అసత్య ఆరోపణలు చేయడం తగదని ఆయన అన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన సమయంలో కల్వకుర్తి నియోజకవర్గ టికెట్ ఏ అభ్యర్థికి కేటాయించిన నా మనసు పూర్తిగా నా సహాయ సహకారాలు అందిస్తానని ఆనాడు చెప్పిన బాలాజీ సింగ్ ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో ఒక జిల్లా వైస్ చైర్మన్ గా కొనసాగుతు సొంత పార్టీలో కొంపటి పెట్టడం పద్ధతి కాదని ఆయన అన్నారు.
నియోజవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చేసిన అభివృద్ధిని త్వరలో అన్ని ఆధారాలతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తారని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అభ్యర్థులు పార్టీకి వ్యతిరేకంగా వివిధ గ్రామాలు,మండలాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయకుండా అధిష్టానం వద్దకు నేరుగా వెళ్లి మీ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు రెడ్డి కృష్ణారెడ్డి,మాడుగుల మండల వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, ఇర్విన్ గ్రామ సర్పంచ్ పుష్పలత జంగయ్య యాదవ్, గిరి కొత్తపల్లి గ్రామ సర్పంచ్ ఆదిమల్ల పద్మ శ్రీను, గొర్రె పవన్ కుమార్ రెడ్డి,
గౌని లాలయ్య గౌడ్, ఎంపిటిసి గ్యార వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ నాగిళ్ళ సత్తయ్య గౌడ్,గొర్రె పవన్ కుమార్ రెడ్డి,కసిరెడ్డి యాదిరెడ్డి,మాజీ ఎంపీపీ జైపాల్ నాయక్,అనిల్,అల్లాజి యాదవ్,మహేష్,బిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.