ధరణి @ కోటి 45 లక్షల 58 వేల ఎకరాలు

భూ సమస్య రైతులకు తలనొప్పిగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. వీఆర్‌వోల వల్ల రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని చెప్పాను. అందులో భాగంగానే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చేందుకు ఉద్యోగులు సహకరించారు అని సీఎం తెలిపారు. ఒక పెద్ద విప్లవం, సంస్కరణ వచ్చినప్పుడు.. బాలారిష్టాలు ఉంటాయి. సమస్యలు, చిక్కులు ఎదురవుతాయి. వీటన్నింటినీ తట్టుకుని ముందుకెళ్లాలి. కొందరు నెగిటివ్ కోణంలో చూపించే ఆస్కారం ఉంటుంది.. దానికి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని సీఎం అన్నారు
ఈ పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ఒక కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూములు ఈ పోర్టల్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ భూముల వివరాలు విదేశాల్లో ఉన్న వారు ఎవరైనా చూసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులు చూసుకోవచ్చు. ఒక్క క్లిక్‌తో భూముల వివరాలు బయటపడుతాయి. పారదర్శకంగా పూర్తిస్థాయిలో ఈ పోర్టల్ నిర్వహణ ఉంటుంది. ఇక నుంచి భూములను గోల్‌మాల్ చేసే ఆస్కారం లేదన్నారు. దేవాదాయ, వక్ఫ్, ఫారెస్టు భూములను ఎవరికీ పడితే వారికి రిజిస్ర్టేషన్లు చేశారు. అది మనందరికీ తెలుసు. ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో అక్రమ రిజిస్ర్టేషన్లు జరగవు అని స్పష్టం చేశారు. అన్ని భూములు ఆటోలాక్‌లో ఉంటాయి. ఎమ్మార్వో, జిల్లా కలెక్టర్ ఓపెన్ చేద్దామన్న అవి ఓపెన్ కావు అని కేసీఆర్ స్పష్టం చేశారు.