చర్చి నిర్మాణానికి 1లక్ష రూపాయల విరాళం
అన్నారం లో చర్చి నిర్మాణానికి 1లక్ష రూపాయలు విరాళం అందజేత
ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
తుంగతుర్తి ఆగస్టు 27నిజం చెపుతాం న్యూస్
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో నూతనంగా సి ఎస్ ఐ చర్చి భవన నిర్మాణం గురించి ఎమ్మెల్యే గారికి తెలియజేయడం తో వెంటనే స్పందించిన తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారు తన వంతు సహకారంగా చర్చి నిర్మాణం కోసం ₹1,00,000/- (ఒక లక్ష రూపాయల) విరాళం చర్చి కమిటీ సభ్యులకు అందజేశారు
అన్నారం గ్రామంలో చర్చి నిర్మాణం కోసం అడిగిన వెంటనే విరాళం అందజేసిన ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ చర్చి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ దొంగరి శ్రీను, కడారి దాసు, బల్లెం ప్రవీణ్ ,బల్లెం నవీన్ సత్యనాధం, ప్రభాకర్, మెట్టు రాజు తదితరులు