Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

20 లక్షలు దోచిన క్రిమినల్ కేసు…. లేనట్లేనా..?

– రావుల పెళ్లిలో కాయ కష్టం చేసుకుని సంపాదించిన మహిళా సంఘాల డబ్బులు మాయం…

– న్యాయం చేయాలని మహిళల గగ్గోలు.

– జిల్లా అధికారులు పేరుకే మాత్రం విచారణ అంటున్న మహిళలు.

సూర్యాపేట ప్రతినిధి ఆగస్టు 27 నిజం చెపుతాం న్యూస్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు పొదుపు చేసుకున్న శ్రీనిధిలో సుమారు 20 లక్షల రూపాయలు మాయం చేసిన వి బి కే, సీసీల చరిత్ర ఆలస్యంగా వెలుగు చూసింది.

తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో 36 మంది మహిళా సంఘాల సభ్యుల వద్ద తీసుకున్నటువంటి సుమారు 20 లక్షల డబ్బులను శ్రీనిధి అకౌంట్ లో జమ చేయకపోగా, అవినీతి ముసుగులో వారికి మాత్రం ఇచ్చినట్లు సంతకాలు చేస్తూ బుక్ కీపర్ సీసీలు చలామణి అవుతున్నారు.

ఈ తతంగం మొత్తం జిల్లా అధికారులకు తెలియగా వారు మాత్రం చప్పుడు చేయకుండా గ్రామానికి వచ్చి విచారణ జరిపారు

ఒకపక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ, అవినీతి ముసుగులో. నిర్లక్ష్యం వహిస్తున్న బుక్ కీపర్, సీసీలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ, క్రిమినల్ కేసు నమోదు చేయాలని గ్రామంలోని మహిళలు డిమాండ్ చేస్తున్నారు