Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దత్తాయిపల్లి లో ఘనంగా హరితహార కార్యక్రమం

తుర్కపల్లి,ఆగస్టు 26(నిజం చెపుతాం) :

మండలం లోని దత్తయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల యాదాద్రీ గ్రీన్ వెంచర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకం చేపట్టిన స్వతంత్ర భారతదేశ వజ్రోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కోటి మొక్కల హరితహారం కార్యక్రమంనికి ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్ పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ తమ వ్యవసాయ భూములలో, ఇంటి పరిసరాలలో చెట్లు నాటాలని అన్నారు.

మన చుట్టూ చెట్లు పెంచుకోవటం వలన మనకు స్వచ్ఛమైన గాలి అందుతుందని దీనితో పాటు ప్రజల అందరికి మంచి ఆక్సీజన్ అందుతుందని అన్నారు.

అంతేకాకుండా పచ్చదనం పెరిగి సకాలంలో వర్షాలు కురిసి తద్వారా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నారు

ఈ కార్యక్రమం లో సర్పంచ్ వెన్నకూచి రామ్మోహన్ శర్మ, ఉపసర్పంచ్ సిద్ధారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శ్యాంసుందర్, ఎంపీడీఓ ఉమాదేవి,ఏ పి ఓ నర్సింహా,పంచాయతీ సెక్రటరీ నర్సింహా,ఫీల్డ్ అసిస్టెంట్ స్వాతి, వీబీకే, వి ఓ ఏ, అంగన్వాడీ టీచర్స్,గ్రామస్థులు,గ్రామ పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.