Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్స్… ఆ సినిమాలు ఏవో తెలుసా??

సినిమాలు విడుదలై హిట్టు టాక్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టం.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టడం అనేది ఎవరి వల్ల కాదు.. అలాంటిది మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్స్ ఎవరో తెలుసా???

డైరెక్టర్ కు సూపర్ హిట అందించిన సినిమాలు ఇవే..

సుకుమార్… ఆర్య

ఆర్య సినిమా 2004 మే 7న విడుదలైంది.. ఈ సినిమాకు డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కు మొదటి సినిమా.. ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోయిన్ గా అనుమహత, శివ బాలాజీ లు లీడ్ రోల్స్ లో కనిపిస్తారు.. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ అండ్ రొమాన్స్ గా ఉంటుంది… ఈ సినిమా కళాశాలలో జరిగే ఒక అందమైన ప్రేమ కథగా ఉంటుంది..

ఈ సినిమాకు మేకర్స్ నాలుగు కోట్లు బడ్జెట్ నిర్మించగా ఈ సినిమా విడుదలై అనుకున్న స్థాయి కంటే ఘన విజయం సాధించి 30 కోట్ల రూపాయలను కలెక్షన్లను వసూలు చేసి పెట్టింది..

ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కు మొదటి సినిమా అయినా ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించ సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ సుకుమార్ సినీ కెరియర్ కు ఈ సినిమా ఎంతగానో దోహదపడింది..

ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కు మంచి గుర్తింపు మంచి పేరును తెచ్చి పెట్టింది..

సుధీర్ వర్మ …స్వామి రా రా 

స్వామి రారా సినిమా 2013 మార్చి 23న థియేటర్లలో విడుదల అయింది.. ఈ సినిమాకు డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా డైరెక్టర్ సుధీర్ వర్మకు తొలి సినిమా.. ఈ సినిమాలో హీరోగా నిఖిల్, హీరోయిన్ గా స్వాతి రెడ్డి, రవిబాబులు ప్రధాన పాత్రలో కనిపిస్తారు..

ఈ సినిమాకు 4 కోట్ల బడ్జెట్ పెట్టి తీయగా ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద 9 కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబట్టింది.. ఈ సినిమా పూర్తిగా క్రైమ్ కామెడీ సినిమాగా ఉంటుంది..

ఈ సినిమా డైరెక్టర్ సుధీర్ వర్మకు తొలి సినిమా అయినా ఈ సినిమా విడుదలై ఘనవిజయం సాధించి డైరెక్టర్ సుధీర్ వర్మకు ఒక గుర్తింపు మంచి పేరు తెచ్చి పెట్టింది. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్స్ లో సుధీర్ వర్మ ఒకరు..