పల్లె సిగలో ప్రకృతి వరాలు..

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెల్లో ప్రకృతి వనాలు త్వరిత గతిన పూర్తి చేయాలని వాజేడు మండల కేంద్రంలోఎంపీపీ శ్యామల శారద గారి అధ్యక్షతన ఏర్పాటుచేసినఈ సమావేశంలో ఎస్ కృష్ణ ఆదిత్య ఐఏఎస్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనాలను పార్కులుగా చేయటం వల్ల పల్లెలు అన్ని ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటాయని ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం అన్నారు.అలాగే ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు, స్మశాన వాటికల త్వరగా పూర్తిచేయాలని సర్పంచులను,అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఎంపీ టి సీ లు జడ్పిటిసి తళ్ళడి పుష్పాలత ఎం యస్ ఓ విజయభాస్కర్ రెడ్డి ఐ టి డి ఏ పి ఓ హనూమంత్ కొడ్వి గార్లు పాల్గొన్నారు