Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నాసా కొత్త టెలిస్కోప్ తయారు చేస్తుందా??

ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి.. ఆ సోలార్ సిస్టమ్స్ లో మనకు తెలియని గ్రహాలు చాలానే ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవడానికి ఇప్పటికే వివిధ అంతరిక్ష కేంద్రాలు వాటి మీద ప్రయోగాలు చేసి వాటిని చూడడానికి టెలిస్కోప్స్ ను పంపించాయి.. అంతరిక్ష కేంద్రమైన నాసా మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయింది.. నాసా వేరే సోలార్ సిస్టం లో ఉన్న గ్రహాల గురించి తెలుసుకోవడానికి ఒక శక్తివంతమైన టెలిస్కోబును తయారు చేస్తుందా?? ఆ టెలిస్కోప్ దేనిమీద ప్రయోగం చేయబోతుంది???

ఆ శక్తివంతమైన టెలిస్కోప్ గురించి తెలుసుకుందాం…

స్టార్ షేడ్ టెలిస్కోప్…

ఈ స్టార్ షేడ్స్ టెలిస్కోప్ ను నాసా తయారు చేయబోతుంది.. ఈ స్టార్ షేడ్ టెలిస్కోప్లో నాలుగు శక్తివంతమైన కెమెరాలు ఉంటాయి.. ఈ టెలిస్కోప్ ను నాసా ఇతర సోలార్ సిస్టమ్స్ లో ఉన్న గ్రహాలను చూడడానికి ఈ కొత్త టెలిస్కోప్ ను తయారు చేస్తుంది.

ఇంత శక్తివంతమైన టెలిస్కోప్ ను ఇంతవరకు ఏ అంతరిక్ష కేంద్రాలు తయారు చేయలేదు.. ఈ టెలిస్కోప్ చూడడానికి ఒక పువ్వు మాదిరిగా ఉంటుంది.. దీని కారణంగా ఈ టెలిస్కోప్ కు స్టార్షేడ్ అనే పేరును పెట్టారు..

శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్న టెలిస్కోప్ తో వేరే సోలార్ సిస్టం లో ఉన్న ఇతర గ్రహాలను చూడడానికి అంత వీలుకావకపోవడం,

వాటిని క్షుణ్ణంగా పరిశీలించలేకపోవడం వలన ఈ స్టార్ట్ టెలిస్కోప్ తో చూడాలనుకుంటున్న గ్రహాలను క్లియర్ గా చూడడానికి అలాగే వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అక్కడ ఉండే వాతావరణం అక్కడ నీరు ఉందా లేదా అనే విషయాల గురించి ఈ స్టార్ షేడ్ టెలిస్కోప్ ను తయారు చేస్తున్నారు..

ఈ టెలిస్కోప్ ను మూడు బిలియన్ డాలర్స్ తో నాసా తయారు చేస్తుంది..