రైతుల శ్రేయస్సుకోసం రైతుబడి రాజేందర్ చేస్తున్న సేవలు అద్భుతం
ప్రపంచంలోనే ఆహార ఉత్పాదన చేసేది రైతు… ఒక్కడే. ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ ఆగస్టు 26 నిజం చెపుతాం న్యూస్
రైతుల శ్రేయస్సు కోసం రైతు బడి కార్యక్రమాల ద్వారా రైతుల్లో ఉత్తేజం నింపుతున్న రాజేందర్ రెడ్డి సేవలు అద్భుతమని, ప్రపంచంలో ఆహార ఉత్పత్తులను తయారు చేసేది ఒక రైతు మాత్రమే ప్రతి రైతును గౌరవించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
శనివారం హైదరాబాదులో రవీంద్రభారతిలో రైతు బడి మిలియన్ మిల్లెట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గడిచిన3 సంవత్సరాలనుండి రైతుల శ్రేయస్సుకోసం రైతు బడి యూట్యూబ్ కార్యక్రమాన్ని ప్రారంభించి, అన్నతి కాలంలోనే 10 లక్షల సబ్ స్క్రైబ్, ఒక మిలియన్ న్యూస్, సంపాదించి, తెలంగాణ ఆంధ్ర వివిధ రాష్ట్రాలలో పర్యటించి ప్రత్యేకంగా రైతులతో మమేకమై, ఒకపక్క రైతుల సమస్యలు మరొక పక్క రైతు చేస్తున్నటువంటి పంటలను ప్రత్యేకంగా వీడియో ఆడియో రూపంలో తెలియజేస్తూ ఖ్యాతిని గడించారని అన్నారు.
కేవలం రైతుబడి కార్యక్రమం ద్వారా, ఆశించిన రీతిలో సంపాదన లేకపోయినప్పటికీ, రైతులకు ఆధునాతన పరికల ద్వారా సమయం, డబ్బు ఆదాయే కార్యక్రమాలను, చేపట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు.
రానున్న రోజుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, రైతు బడి కార్యక్రమాలను అనుసంధానం చేస్తూ, రైతులకు మరింత దగ్గర కావాలని మంత్రి ఆశించారు.
అనంతరం పలువురు రైతులను, రాజేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. మంత్రి నిరంజన్ రెడ్డి అమూల్యమైన సమయాన్ని కేటాయించి, రైతుల శ్రేయస్సు పై, గంట తరబడి, మాట్లాడం తో చప్పట్లతో సభా ప్రాంగణం మారుమోగింది.
కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ ఆర్టిఐ కమీషనర్ కట్టా శేఖర్ రెడ్డి, రైతులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు అంతరం రైతుబడి మాస పత్రికను ప్రారంభించారు…