Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేను సేవకుడిలా ఉంటా..

__అందరూ ఇస్తున్నట్లు నేను ఉచిత హామీలు ఇవ్వలేను.

__అందరూ చూస్తున్నట్లు నేను అవినీతి రాజకీయాలు చేయను.

__మన కళ్ళ ముందు మనకు అభివృద్ధి కనిపించాలి. ఆ అభివృద్ధి నేను చేసి చూపిస్తాను.

డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్.

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఆగస్టు 26,( నిజం న్యూస్):

అభివృద్ధి చేస్తాం అనే మాటలు ఎన్నికల ముందు నాయకులు మాట్లాడుతుంటారు. ఎన్నికలలో గెలిచాక వారి సంపాదన మీద ఉన్న శ్రద్ధ సమాజం మీద ఉండదు. అభివృద్ధి చేయాలని సమాజాన్ని మార్చాలని వారు ఏమాత్రం ప్రయత్నించరు.

అని భూపాల్ నాయక్ విమర్శించారు. డోర్నకల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు ఏలిన వారు కొత్తగా ఏమైనా పరిశ్రమలు తెచ్చారా? పెట్టారా? యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారా? అనీ భూపాల్ నాయక్ ప్రశ్నించారు.

డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న రైతులకు ఏమైనా నష్టపరిహారం ఇప్పించారా? డోర్నకల్ లో ఉన్న మహిళల కొరకు ఏమైనా అభివృద్ధి సంఘాలు పెట్టారా? అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా డోర్నకల్ ప్రజలు మోసపోతూనే ఉన్నారు.

నాయకులు మోసం చేస్తూనే ఉన్నారు. నాయకులకు పరిపాలన తెలియదు. అసెంబ్లీలో ప్రశ్నించడం ఎలాగో తెలియదు. డోర్నకల్ ప్రజలారా! ఒక్కసారి ఆలోచించండి. మీ వద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం “ఓటు”. ఆ ఓటు హక్కుతోనే అవినీతి చేస్తున్న నాయకులకు బుద్ధి చెప్పాలి.

సమాజం మీద సామాజిక మార్పు కోసం అడుగులు వేస్తున్న భూపాల్ నాయక్ రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిపించండి. సామాజిక అభివృద్ధి సాధించండి. అంటూ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు భూపాల్ నాయక్ విజ్ఞప్తి చేశారు.