Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న శివ సినిమా… రిలీజ్ ఎప్పుడు అంటే??

అక్కినేని నాగార్జున కెరీర్లో శివ సినిమా లో నటించి మంచి గుర్తింపు పొందాడు.. ఈ సినిమా అక్కినేని నాగార్జునకు ఎంతగానో దోహద పడింది.. ఈ సినిమా మళ్లీ 4k లో రీ రిలీజ్ చేయబోతున్నారు.. రీ రిలీజ్ ఎప్పుడు అంటే??

శివ…

శివ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదల అయింది.. ఈ సినిమాకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు.. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మంచి సంగీతాన్ని అందించారు.. ఈ సినిమాలో హీరోగా నాగార్జున హీరోయిన్గా అమల లు లీడ్ రోల్స్ చేశారు.. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ సినిమాగా ఉంటుంది.. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు..

ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించడంతోపాటు మంచి కలెక్షన్లను తెచ్చి పెట్టింది.. ఈ సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు అలాగే అక్కినేని నాగార్జునకు ఎంతగానో మంచి గుర్తింపు పేరు తెచ్చి పెట్టింది.. ఈ సినిమా విడుదలై యూత్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది…

ఈ సినిమాలో నాగార్జున డైలాగ్ డెలివరీ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు అలాగే అప్పట్లో యూత్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నాగార్జున క్రియేట్ చేశారు.. ఈ సినిమాను తెలుగు హిందీ భాషలలో విడుదల చేశారు..

శివ సినిమా రీ రిలీజ్ ఎప్పుడంటే??

శివ సినిమా విడుదలై మంచి గుర్తింపు పొందడంతో మళ్లీ మేకర్స్ ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.. అయితే ఈ సినిమాను మేకర్స్ ఫోర్ కే లో శివ సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పారు..

శివ సినిమా తొందరలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా విడుదలై మళ్లీ ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాల్సి ఉంది…