Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇండస్ట్రీ హిట్ సినిమాలు వదులుకున్న నాగార్జున- ఆ సినిమాలు ఏవో తెలుసా??

అక్కినేని నాగార్జున విక్రమ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించి ఆకట్టుకున్నారు.. నాగార్జున కెరియర్ స్టార్టింగ్ లో రెండు ఇండస్ట్రీ హిట్లను వదులుకున్నారు.. అక్కినేని నాగార్జున ఈ రెండు సినిమాలు చేసి ఉంటే ఇప్పుడు ఆయనను మించిన స్టార్ హీరో ఉండేవారే కాదు..

ఆ రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఏవో తెలుసా??

1. కలిసుందాం రా..

కలిసుందాం రా సినిమా 2000 సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైంది.. ఈ సినిమాకి డైరెక్టర్ ఉదయ శంకర్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోయిన్గా సిమ్రాన్ లీడ్ రోల్స్ చేశారు.. ఈ సినిమా పూర్తిగా డ్రామా అండ్ ఫ్యామిలీకి సంబంధించిన సినిమాగా ఉంటుంది.. ఈ సినిమాకి పది కోట్లు బడ్జెట్ నిర్మించగా ఈ సినిమా విడుదలై 26.7 కోట్ల రూపాయలు కలెక్షన్లను సాధించింది.

కలిసుందాం రా సినిమా విడుదలయ్య ఘన విజయం సాధించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.. ఈ సినిమాకు నేషనల్ ఫిలిం అవార్డు బెస్ట్ ఫ్యూచరేట్ ఫిలిం గా అవార్డు అందుకుంది.. ఈ సినిమా థియేటర్ల వద్ద 190 రోజులు ఆడి మంచి విజయాన్ని అందుకుంది..

ఈ సినిమాను మొదటిగా అక్కినేని నాగార్జునకు వినిపించగా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండటంవల్ల ఈ సినిమాను చేయలేకపోయారు..

2. గ్యాంగ్ లీడర్..

గ్యాంగ్ లీడర్ సినిమా 1991 మే 9న విడుదలైంది.. డైరెక్టర్ విజయ్ బాపినీడు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు.. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ అండ్ డ్రామాగా ఉంటుంది..

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ విజయశాంతి లు ముఖ్య పాత్రలు పోషించారు.. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి మంచి కలెక్షన్స్ రాబట్టింది.. ఈ సినిమా మెగాస్టార్ కెరియర్ లో మెగాస్టార్ చిరంజీవి క ఒక మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది..

గ్యాంగ్ లీడర్ సినిమా మెగాస్టార్కు మంచి మాస్ ఇమేజ్ సినిమాగా ఈ సినిమా ఎంతగానో దోహద పడింది. ఈ సినిమా గురించి ఇప్పటికి కూడా మెగాస్టార్ గుర్తు చేసుకుంటూ ఉంటారు..

ఈ పై రెండు సినిమాలు అక్కినేని నాగార్జునకు వినిపించగా కొన్ని కారణాల వల్ల ఈ రెండు సినిమాలను చేయలేకపోయారు.. ఈ రెండు సినిమాలు విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచాయి..