Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బయ్యారం సంఘ రైతులకు రుణమాఫీ వస్తుందా………..?

ఈసారైనా పి. ఏ. సి. యస్. బయ్యారం సంఘ రైతులకు రుణమాఫీ వస్తుందా………..?

——తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నీరంజన్ రెడ్డి ని కలిసిన బయ్యారం పి. ఏ. సి. యస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి .
బయ్యారం :ఆగష్టు.25. (నిజంచెపుతాం న్యూస్ )
బయ్యారం పి. ఏ. సి. యస్ సంఘంలో 2018 సం ” లోపు మొత్తం రైతులు 2766 మందికి 66544842/- రూపాయలు ఋణం పొంది వున్నారు.

ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు దఫాలుగా రుణ మాఫీ చేయడం జరిగినది.

మొదటి దపా 2020 వ సంవత్సరంలో 25000/- లోపు మొత్తం రైతులు 1542 మందికి ఋణం 16593627/-కు గాను 608 మందికి ఋణం 6102676/- మాత్రమే రుణ మాఫీ వర్తించినది. మిగిలినవి 934 మందికి ఋణం 10490951/- రుణ మాఫీ వర్తించలేదు.

రెండవ దఫా 2021 వ సంవత్సరంలో 50000/- లోపు మొత్తం రైతులు 1081 మందికి ఋణం 37509526/- కు గాను 395 మందికి ఋణం 13408230/- రుణ మాఫీ వర్తించినది.

మిగిలినవి 686 మందికి ఋణం 26173614/- రుణ మాఫీ వర్తించలేదు.50000/- నుండి 100000/- లోపు మొత్తం రైతులు 143 మందికి ఋణం 10369371/- కు గాను ఒక్క రైతుకు కూడా రుణ మాఫీ వర్తించలేదు.

దయచేసి మా సంఘమునకు రుణ మాఫీ వర్తించేటట్లు తగు చర్యలు తీసుకోగలరని అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు సంఘాలకు గాను ఋణ మాఫీ రాలేదు దీనిపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఇందుకు గాను వ్యవసాయ శాఖ సంబంధిత అగ్రికల్చర్ అధికారులను ,కమిషనర్ గారిని ఈ సమస్యను తీసుకుపోవడం జరిగింది.

దీనిపై సానుకూలంగా స్పందిండం జరిగింది.ఈ కార్యక్రమంలో హాక చైర్మన్ మెచ్చ శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు.