తరగతి గదిలో తేలు కుట్టి విద్యార్థి మృతి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం ఆగస్టు 25,(నిజం న్యూస్) బ్యూరో::
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో తేలు కుట్టి విద్యార్థి మృతి చెందాడు. కోరుమిల్లి గ్రామానికి చెందిన, వై. ప్రసాద్ శ్రీదేవిల చిన్న కుమారుడు అభిలాష్ (14), వాకతిప్ప జడ్పీహెచ్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
అయితే గురువారం తరగతి గదిలో చక్కిల రేపర్లు ఎక్కువగా ఉండడంతో మరో విద్యార్థితో కలిసి శుభ్రం చేయుచుండగా అభిలాష్ ఎడమ చేతి వేలును తేలు కుట్టింది.
ఉపాధ్యాయులు వేను వెంటనే స్థానిక పిహెచ్సికి తరలించి ప్రధమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జిజిహెచ్ కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఊపిరితిత్తులలో విషం చేరడంతో రక్తపు వాంతులు అయ్యి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. కేసు నమోదు చేసినట్లు అంగర ఎస్సై జి చంటి తెలియజేశారు.
మృతుడి తండ్రి వలస కూలీగా వరంగల్లో పనిచేస్తున్నాడు. తల్లి ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటున్నారు.
అయితే తాతయ్య వద్ద ఉంటూ చదువు కుంటూ ఉండగా ఇలా జరగడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.