Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సమయపాలన పాటించని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది

రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే పట్టింపేలేదని రోగులుఆరోపణలు.

జీతం కోసం పని చేస్తున్నారా సేవ చేయడం కోసం చేస్తున్నారో తెలియదు.

కరకగూడెం ఆగస్టు 25,(నిజం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య పరంగా అత్యాధునిక సౌకర్యాలతో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వైద్య సేవలు అందించడంలో అగ్రగామిగా ఉండాలని నిరంతరం కృషి చేస్తున్న

సందర్భంలో కరకగూడెం మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక దావకానలో సమయపాలనకు మంగళం వేసి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ హాస్పిటల్ కు దర్శనం ఇచ్చిన ఒకరు ఉంటే ఒకరు ఉండరు, పేషెంట్లు హాస్పటల్ కు వైద్యం చేయించుకోవడానికి వచ్చిన కూడా పట్టించుకునే పరిస్థితి లేదు .

ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే అందిన కాడికి దోచుకుంటున్నారని గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే పట్టించుకునే నాధుడు లేడని వాపోతున్నారు. డాక్టర్ అందుబాటులో ఉంటే మెడికల్ షాప్ లో ఫార్మసిస్ట్ ఉండరు .

టెస్టులు రాస్తే ల్యాబ్ టెక్నీషియన్ ఉండరు ఈ రకంగా ప్రవర్తన చేస్తే హాస్పటల్ లకి రావాలనుకున్న పేద ప్రజలు రాలేక ప్రవేట్ హాస్పిటల్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది . ప్రజలు ప్రభుత్వ హాస్పటల్ కు రావడం మర్చిపోతారు ,

అక్కడక్కడ గ్రామంలో అధిక జ్వరాలతో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు ఎటు వెళ్ళాలని అర్థం కాని పరిస్థితిలో ఉండి సతమతం అవుతుంటే రైతు దావకాన కు వస్తే పట్టింపే లేదయా జీతం కోసం పనిచేస్తున్నారా సేవ చేయడం కోసం పని చేస్తున్నారా పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారు ఎవరికి తెలియదు అని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెడికల్ షాప్ లో మందులు ఎవరు ఇవ్వాలి

మెడికల్ దుకాణంలో అర్హత లేని వారు మందులు ఇస్తు ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వాపోతున్నారు. తెలిసి తెలియని మందులు ఇస్తే రోగులకు ఎవరికైనా ఏమన్నా అయితే ఎవరూ బాధ్యత వహిస్తారని అంటున్నారు.

డాక్టర్ రూటే ఇది….?

జ్వరం వచ్చిందని జలుబు చేసిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే వారిని కనీసం ఎలా ఉందని కూడా రోగులని ముట్టి చూడడం లేదు రోగులు అంటున్నారు.

జ్వరము అని చెప్తే దానికి సంబంధించిన మెడిసిన్ పెన్నుబట్టి రాస్తున్నాడు తప్ప ఏంటి ఎలా ఉందని కూడా పలకరించడం లేదని రోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రవేట్ హాస్పిటల్ కి వెళ్తే పరిస్థితిలేని ప్రభుత్వ దావకానా కు వస్తే ఇలా చేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రక్త పరీక్ష కేంద్రంలో ఎప్పుడు ఎవరుంటారు తెలియదు

ఇప్పటికే మండలంలో డెంగ్యూ జ్వరాలు అధికంగా ఉండటం వల్ల ప్రవేట్ ల్యాబ్ లో టెస్టులు కు అధిక డబ్బులు కావటం వల్ల ప్రభుత్వ దావకాన కు వస్తున్న పేద ప్రజలకు టెస్టులు చేసేవారు ఎప్పుడు ఎవరు ఉంటారు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు.

సమయపాలన మాత్రం పట్టించుకోవడం లేదు ఎవరిష్టం వారిది అన్నట్టు మమ్మల్ని ఎవరు ఏమంటారు అన్నట్లు కూడా నిర్లక్ష్యమైన సమాధానాలు చెబుతున్నారు.

కొంతమంది పేద ప్రజలు గెజిటెడ్ సంతకం కోసం పోతే

నేను సంతకం ఎందుకు పెట్టాలి సంతకం పెట్టాలంటే మెడికల్ ఆఫీసర్ అని సర్టిఫికెట్లు రాసి ఉంటే తప్ప నేను పెట్టను మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నట్లు పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు,

కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి.