Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కలెక్టరేట్లలో ధరణి ఆపరేటర్లదే హావా..?

– సక్సెషన్ పేరుతో మాడ్గుల మండలంలో కోట్ల విలువ చేసే భూముల స్కామ్ లో ఆ ఆపరేటర్ దే కీలక పాత్ర!!

సొంత మేనమామ భూమికే ఎసరు!!

న్యాయం చేయాలని సంబంధిత అధికారులను వేడుకున్నా శూన్యం!!

మాడ్గుల ఆగష్టు 25( నిజం చెపుతాం):

రాష్ట్రంలో ధరణి రాకతో అనేక భూసమస్యలు పరిష్కారం అయితావని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే మీడియా సమావేశాలలో చెప్పగా,ప్రస్తుతం చెప్పుతుండగా ధరణి పోర్టల్ రైతులకు శాపంగా మారిందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన తెలిపిన వివరాల మేరకు రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామానికి చెందిన బొజ్జ వెంకటయ్య కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి వరసత్వంగా తండ్రి నుండి అయన కు విరసత్ కాగా ధరణి రాకతో పాత పాస్ పుస్తకం బదులు కొత్త పాస్ పుస్తకం వచ్చి రెండు సార్లు రైతు బంధు డబ్బులు కూడా పడ్డాయి.

బొజ్జ వెంకటయ్య అక్క కొడుకు క్రాంతి కుమార్ డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనోపాధి పొందుతుండగా హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి పరిచయం కావడంతో క్రాంతి కుమార్ అదృష్టం నక్క తోక తొక్కినట్లు కలిసిచ్చిందని క్రాంతి కుమార్ మేనమామ బొజ్జ వెంకటయ్య అన్నారు.

ఓ ప్రైవేట్ ఓద్యోగి వారి మామ వెంకటయ్య ఫోన్ లో యాభై వేలు లంచం గా ఇచ్చి ఉద్యోగంలో చేరడాని మాట్లాడుకున్న సంభాషణ ఎప్పుడు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్ లలో వైరల్ అవుతుంది.

గత మూడు సంవత్సరాల క్రితం కందుకూరు తాసిల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా ప్రయాణం మొదలు పెట్టిన క్రాంతి కుమార్ తదుపరి కోత్తురు,సంగారెడ్డి, మండలలో పని చేస్తు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లక్డికపుల్ లో వున్నప్పుడు కలెక్టరేట్ లొ ఆపరేటర్ పోస్ట్ కాలిగా ఉండడంతో క్రాంతి కుమార్ ని కలెక్టర్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా బదిలీ చేశారు .

అప్పటి నుండి క్రాంతి కుమార్ అనేక అక్రమ భూదందాలలో పాత్ర వహిస్తు అయన ఆడిందే ఆట పాడిందే పాటగా కొద్దీ కాలంగా కొనసాగుతుంది అని వారి మేనమామ వెల్లడించారు.

మాడ్గుల మండలంలో వేల కోట్ల విలువ చేసే భూములలో తల దూర్చి సక్సెషన్ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద కోట్ల రూపాయలు దండుకున్నాడని అనేక సార్లు పలు దిన పత్రికలలో కథనలు వచ్చిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వెనుక దగి వున్నా రహస్యం ఏంటని వారి మేనమామ బొజ్జ వెంకటయ్య అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

సొంత మామ అయినా బొజ్జ వెంకటయ్య నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిపై కన్నేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పలు మార్లు సంబంధిత అధికారులకు క్రాంతి కుమార్ పై పిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదని అయన పేర్కొన్నారు.

మూడు సంవత్సరాల కాలంలో ఇర్విన్ గ్రామంలో 30 లక్షల విలువ చేసే ఇటీవల నిర్మించిన కొత్త ఇల్లు,మీర్ పేట్ లో 50 లక్షల విలువ చేసే సొంత ఇల్లు, హైదరాబాదులో పలు ప్లాట్లు, స్వగ్రామం ఇర్విన్ లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఇటీవల కొనుగోలు చేయడంతో మేనమామతో పాటు గ్రామస్తులు అవకైతున్నారు.

కలెక్టర్ కార్యాలయంలొ ధరణి ఆపరేటర్ కు మూడు సంవత్సరాలలో ఆరు కోట్ల పై చిలుకు ఆస్తులు సంపాదన పై పిర్యాదులు చేసిన అధికారులు పట్టించు కోవడం లేదని వెంకటయ్య అన్నారు.

ప్రస్తుతం క్రాంతి కుమార్ మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు వారి మేనమామ తెలిపారు.

ఇప్పటికైనా సంబందింత అధికారులు స్పందించి అక్రమ ఆస్తులపై ధర్యాప్తు చేసి క్రాంతి కుమార్ పై చర్య తీసుకొవాలని ఆయన డిమాండ్ చేశాడు.