Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రెచ్చి పోతున్న కలప స్మగ్లర్లు

– పట్టపగలే రవాణా..

చర్ల ఆగస్టు 25(నిజంచెపుతాం)

మండలంలో కలప స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పట్టపగలే విలువైన టేకు కలపను అక్రమంగా తరలించడానికి తెగబడుతున్నారు.

వివరాల్లోకి వెళితే చర్ల మండల పరిధిలోని కుర్నపల్లి అటవీ ప్రాంతంనుండిట్రాక్ట ర్ పై అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు చర్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉపేందర్ ఆదేశాలతో డిప్యూటీ రేంజ్ అధికారి అచ్చ తన సిబ్బందితో కలసి శుక్రవారం మధ్యాహ్నం చింతగుప్ప వెళ్ళే రహదారిలో కాపుకాసారు.

అటవీశాఖ అధికారులను చూడగానే కలప తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు.టేకు కలపతో ఉన్న ట్రాక్టర్ ను అటవీశాఖ కార్యాలయానికి తరలించారు

ట్రాక్టర్ లో ఉన్న 53 టేకు చక్కలను సీజ్ చేసారు.వీటి విలువరూ73.953.వుంటుందని ఆయనతెలిపారు ఆయనవెంట .సిబ్బందివున్నారు