Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భూపాల్ నాయక్ ని గెలిపిద్దాం డోర్నకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం..

డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు యువకుల అధ్వర్యంలో భారీ ర్యాలీ.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి గిరి.

కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగన్న గౌడ్.

ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోతు భీమా నాయక్.

కురవి,నిజంచెపుతాం,ఆగస్టు,25:

డోర్నకల్ లో బలమైన నాయకుడు రెడ్యానాయక్ ను ఓడించాలంటే నిజాయతీ పరుడు సేవ చేసే గుణం వున్న భూపాల్ నాయక్ వల్లనే సాధ్యం అన్నారు.

శుక్రవారం భూపాల్ నాయక్ ఆధ్వర్యంలో డోర్నకల్ నియోజకవర్గంలోని డోర్నకల్ మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో ప్రారంభమై గొల్లచర్ల మీదుగా,చిలుకొడు,దేవుని సంకిస, సీరోలు మీదుగా చింతపల్లి,అయ్యగరిపల్లి, నుండి కురవి మండలానికి చేరుకుంది.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో,యువకులతో,అభిమానులతో గెలుపుని కాంక్షిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

కురవి మండలానికి చేరుకున్న సందర్భంగా గుడి సెంటర్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి దొంతు గిరి,జర్రిపోతుల రంగన్న గౌడ్,(ఎల్ హెచ్ పిఎస్)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమా నాయక్ లు మాట్లాడుతూ….డోర్నకల్ నియోజకవర్గం అభివృధి చెందాలంటే భూపాల్ నాయక్ లాంటి మానవత్వం వున్న వ్యక్తి,సేవ దృక్పథం కలిగిన నాయకుడు ను గెలిపించాలని వారు కోరారు.

ఈ నియోజకవర్గం కేంద్రంలో ప్రశ్నించే గిరిజన యువకుల మీద ప్రజల మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు అని అవేదన వ్యక్తం చేశారు.

డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో విద్యా,వైద్యం,ఉపాధి తీవ్రంగా వెనుకబడి ఉందని,గత ముప్పై సంవత్సరాల నుండి ఏకతాటిగా పరిపాలిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అభివృధి చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని,అదే విధంగా తండాల గ్రామ పంచాయతీ కోసం ఆనాడు మంత్రిగా వున్న రెడ్యా నాయక్ ఆపింది మీరు కదా?అలాంటిది తండాల పర్యటన ఏ మొఖం పెట్టుకొని ఏ విధంగా చేస్తారని హెచ్చరించారు.

డోర్నకల్,కురవి, నరసింహుల పేట, దంతాలపల్లి,చిన్న గూడూరు మండలాల్లో జూనియర్ కళాశాల లేక విద్యార్థులు అనేక అవస్ధలు పడుతున్నారు అని తెలిపారు.

మీ రాజకీయ చరిత్రలో ఎవరికైనా బస్ పాస్ సౌకర్యాలు,విద్యార్థులకు ఉచిత స్కాలర్షిప్స్, ఉపాధి అవకాశాలు కల్పించారని ప్రశ్నించారు.కానీ భూపాల్ నాయక్ ఏ పదవి లేకుండా 5000 వేల మంది విద్యార్థులకు ఉచిత స్కాలర్ షిప్స్,బస్ పాస్,యువత ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు.

అందుకనే నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కేవలం భూపాల్ నాయక్ తోనే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో సచిన్ , విష్ణు నాయక్,వినోద్ నాయక్,శ్రీనివాస్,కిరణ్,అరుణ్,వినయ్,ప్రశాంత్,శ్రీను,రమేష్ యువకులు పాల్గొన్నారు.