Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామరక్ష

తుంగతుర్తి లో వికలాంగులకు పెంచిన పింఛన్ల ప్రపోజల్స్ ను పంపిణీ లో

జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి ఆగస్టు 25 నిజం చెపుతాం న్యూస్

తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ శ్రీరామరక్షని మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జాదీపిక యుగంధరావ్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు.

శుక్రవారం మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో వికలాంగుల రాష్ట్ర నాయకుడు నేను రా మల్లారెడ్డి అధ్యక్షతన తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ మండలాల్లో ని వికలాంగులకు పెంచిన పింఛన్లు ప్రపోజలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత వికలాంగుల యొక్క కష్టాలు తెలుసుకొని మొట్టమొదటిసారిగా వెయ్యి రూపాయలు ,తదనంతరం 2016 , 2018లో 3016, ప్రస్తుతం 4016 ఏ ఒక్క వికలాంగులు అడగకుండగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారని కొనియాడారు.

నియోజకవర్గంలో సుమారు 40000 పైచిలుకు వికలాంగులు ప్రతినెల ప్రభుత్వంనుండి పింఛను పొందుతున్నట్టు తెలిపారు. ప్రక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర బీహార్ ఒరిస్సా లో కూడా మనకు వస్తున్న పింఛన్లు ఆ ప్రభుత్వాలు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రైతు బంధు రైతు రుణమాఫీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి దళిత బంధు గృహలక్ష్మి వంటి పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాను అన్నారు.

జిల్లాలోని వికలాంగుల సమస్యలను తెలుసుకొని విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట కేంద్రంలో వికలాంగుల శ్రేయస్సు కోసం రెండు కోట్ల రూపాయల విలువగల నూతన భవనాన్ని నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని ప్రజలకు సాగు కోసం సాగునీరు త్రాగు కోసం త్రాగునీటిని అందించినట్టు తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రాకతో గ్రామాల్లోని కుంటలు చెరువులు నిండిపోయి ప్రతి భూమి సస్యశ్యామలమయాయని దీనితో రైతులు సుఖంగా ఉన్నారని అన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగుల కుటుంబాలు దృఢ సంకల్పంతో కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గంలో నన్ను, ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక మెజార్టీ గెలుపొందుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కల్లట్లపల్లి శోభన్ బాబు ఎంపీపీ గుండ గాని కవితా రాములు గౌడ్ వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ ,డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ఎస్సీ రజాక్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య

ఎంపీటీసీ కేతిరెడ్డి లతా రెడ్డి కందాల దామోదర్ రెడ్డి నల్లు రామచంద్రారెడ్డి పులుసు యాదగిరి గౌడ్ ఎంపీటీసీ చెరుకు సృజన పరమేశ్ ,తడక మల్ల రవికుమార్ డి ఆర్ డి ఎ పి డి కిరణ్ కుమార్ ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్ వివిధ శాఖల అధికారులు వికలాంగులు పాల్గొన్నారు…