విప్ రేగా కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి నానాటికి విజృంభిస్తునే ఉంది. ఇప్పటికే కే మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు దీని బారిన పడగా రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సైతం కరోనా బారిన పడ్డారు. గురువారం మంత్రి పర్యటన లో బిజీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ అనారోగ్యంగా ఉండటంతో గురువారం పరీక్షలు చేయించుకున్నారు. దీనితో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంటనే రేగా హోమ్ క్వారంటైన్ కి వెళ్లారు. మంత్రి పర్యటన సందర్భంగా తనకు సమీపంగా ఉన్న వారందరూ కొద్ది రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ,మణుగూరు క్యాంప్ కార్యాలయానికి ఎవరు రాకూడదని ఒక ప్రకటనలో కోరారు.