Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఓటిటీలో సందడి చేస్తున్న బేబీ మూవీ…

చిన్న సినిమాలు గా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఎన్నో.. తక్కువ బడ్జెట్ తో వచ్చి ఓల్డ్ వైడ్ గా ఎవరు ఊహించని విధంగా 100 కోట్లు కలెక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు.. అలా తక్కువ బడ్జెట్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమా ఏదో తెలుసా??

బేబీ..

బేబీ సినిమా వరల్డ్ వైడ్ గా 2023 జూలై 14న విడుదలైంది.. ఈ సినిమాకు డైరెక్టర్ సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించారు.. ఈ సినిమా పూర్తిగా రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది.. ఈ సినిమాలో హీరోగా ఆనంద్ దేవరకొండ, హీరోయిన్గా వైష్ణవి చైతన్య, సహాయ నటుడిగా విరాజ్ అశ్విన్ లు ముఖ్యపాత్రను పోషించారు..

ఈ సినిమా ఒక ప్రేమ కథగా ఉంటుంది.. ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అండ్ అమ్మాయి ప్రేమ కథ గురించి ఈ సినిమాలో చూపించడం జరిగింది.. అలాగే వారి మధ్యల జరిగిన సంఘటనలు చేదు విషయాల వారు ఎదుర్కొన్న సమస్యల గురించి ఈ సినిమాలో మంచిగా చూపించారు..

అలాగే ఈ సినిమాలో ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి ఉన్నత చదువుల కోసం పెద్ద కాలేజీకి వెళ్లగా అక్కడ జరిగిన సంఘటనలు అక్కడ పరిచయమైన వ్యక్తుల గురించి హీరోయిన్ పూర్తిగా మారిపోయి డ్యూయల్ లవ్ ట్రాక్ను నడిపిస్తుంది.. ఈ సినిమా మోసపోయిన ఇద్దరు ప్రేమికుల గురించి ఈ సినిమాలో డైరెక్టర్ చేయించారు..

బేబీ సినిమా తక్కువ బడ్జెట్ తో వచ్చి ఎవరు ఊహించని విధంగా ప్రేక్షకులను అలాగే యువతను బాగా ఆకట్టుకుంది.. ఈ సినిమాకు మేకర్స్ తక్కువ బడ్జెట్ పెట్టగా ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి 70 కోట్ల రూపాయలను కలెక్షన్లను రాబట్టింది..

ఈ సినిమా 2023 ఆగస్టు 25న ఓటీటీలో విడుదలై ఓటీటీలో సందడి చేస్తుంది.. ఈ సినిమా అనుకున్నంత స్థాయి కన్నా మంచి గుర్తింపు పొందింది..

అలాగే ఈ సినిమా వెబ్ సిరీస్ చేసుకునే వైష్ణవి చైతన్యను తెలుగు హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి అలాగే ప్రేక్షకులకు పరిచయం చేసింది..

అలాగే ఈ సినిమా విడుదలై వైష్ణవి చైతన్యకు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది..