Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చంద్రయాన్ -3 లాండర్ అండ్ రోవర్ చేయబోయే పరిశోధనలు ఏవో తెలుసా??

ఈ అనంతమైన విశ్వంలో మనకి తెలియని గ్రహాలు వింతలు ఎన్నో.. కొన్ని గ్రహాలు మనకి ఎంతో కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. వాటిని చేరుకోవాలన్న మనకి ఎన్నో వేల సంవత్సరాలు పడతాయి.. భూగ్రహానికి శాటిలైట్ గా పిలవబడే చంద్రుడిపై ఎన్నో దేశాలు ఎన్నో పరిశోధనలు చేశాయి. అందులో మన భారతదేశం ఒకటి.. చంద్రయాన్-2 పరిశోధన ఫెయిల్ అయిన చంద్రయాన్-2 మిషన్ 90 శాతం డేటాను కలెక్ట్ చేయగలిగింది మేత పది శాతం చంద్రుడిపై జరగాల్సి ఉంది.. చంద్రయాన్ -2 ల్యాండర్ ఫెయిల్ అవ్వడంతో చంద్రయాన్-2 మిషన్ ఫెయిల్ అయింది..

భారతదేశం చంద్రయాన్- 3 పేరుతో జాబిల్లిపై పరిశోధనలు చేస్తుంది.. 2023 ఆగస్టు 24 సాయంత్రం 6 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడి సౌత్ పోల్ పై విజయవంతంగా అడుగు పెట్టింది… చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమై మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.. చంద్రుడి సౌత్ పోల్ పై మొదట అడుగు పెట్టిన దేశంగా భారతదేశంలో చరిత్రలో నిలిచిపోయింది..

చంద్రయాన్-౩ ముఖ్య ఉద్దేశం ఇదేనా???

చంద్రయాన్ 3 మిషన్ ముఖ్యముద్దేశం ఏంటంటే చంద్రుడు పై వాతావరణం ఎలా ఉంది, చంద్రుపై ఉన్న రేడియేషన్,, అలాగే చంద్రుడు పై దొరికే అద్భుతమైన కణజాల గురించి, చంద్రుడిపై మానవుడ నివసించగలడా లేదా అనే దాని గురించి చంద్రయాన్ -3 ముఖ్య ఉద్దేశం..

చంద్రయాన్- 3 ల్యాండర్ అండ్ రోవర్ చంద్రుడిపై చేయబోయే పనులు ఇవే..

చంద్రుడిపై ల్యాండ్ అయిన కొంత సమయానికి ప్రజ్ఞ యాన్ డ్రైవర్ కొంత సమయానికి బయటకు వచ్చింది.. ఈ రోవర్ చంద్రుడు పై చేయబోయే పరిశోధనలు ఏంటంటే.. లండర్ చంద్రుడు మీద వాతావరణం గురించి అలాగే చంద్రుడి మీద ఉండే రేడియేషన్ గురించి పరిశోధనలు చేస్తాయి..

ప్రజ్ఞయాన్ రోవర్ చేసే పనులు ఇవే..

ఈ రోవర్ చంద్రుడు పై ఉండే మట్టిని పరిశోధన చేస్తుంది..

అలాగే అక్కడ ఫోటోలను తీసి పంపిస్తుంది.. రోవర్ చంద్రుడిపై 3D మ్యాప్స్ చేయడం వంటి పనులు చేస్తాయి..