Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దివ్యాంగులకు ప్రభుత్వం కొండంత ఆసరా 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు స్వర్ణయగం ఆరంభమయ్యింది. దెసంలోనే అత్యధికంగా దివ్యాంగులకు 3016 రూపాయల నుంచి 4016 రూపాయలకు పెన్షన్ పెంచిన సందర్భంగా నిన్న ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకపరిధిలో దివ్యాంగులకు గురువారం ప్రొసిడింగ్స్‌ను అందజేశారు.

అంగవైకల్యం ఒక లోపం మాత్రమేనని, ముందుకు పోకుండా అడ్డుకునే శాపం కాదని, లక్షాన్ని సాధించడంలో వైకల్యం అడ్డురాదని నిరూపించినవారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారన్నది విస్పష్తం.

దెసంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో పొందుతున్న సౌకర్యాలు కల్పించదం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల 40 వేల మంది దివ్యాంగులకు నెలకు రూ. 3 వేల16 ద్వారా నెలకు 180 కోట్ల చొప్పున, ఏడాదికి 2160 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది.

ఇక ఇతర పధకాల విషయానికి వస్తే వికలాంగుల సహకార సంస్థ ద్వారా అనేక సహకార ఉపకరణాలు ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్స్‌లో 5శాతం రిజర్వేషన్‌లు, విద్య, ఉపాధి పథకాల్లో 5శాతం రిజర్వేషన్లు, ఉద్యోగ నియామకాల్లో 4శాతం రిజర్వేషన్ కల్పిస్తోంది.

బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ అవయవాలు మొత్తం 14 రకాల వస్తువులను దివ్యాంగులకు అందిస్తోంది.

ఇక పేదవారికి అమలు చేస్తున్న రైతు బంధు, రైతు భీమా, కళ్యాణలక్ష్మి, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా, నియోజకవర్గంలో వేల మంది వికలాంగులకు రూ. 4016రూ, వృద్ధులకు 2016 రూపాయల పెన్షన్, ఉచిత ఆవాసాలు, కెసిఆర్ కిట్టు వంటి 450 పథకాలు అమలు దివ్యాంగులకు కూడా లభ్యమవుతోంది.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి అండగా నిలవాలి, వారి అభివృద్ధికి చేయూతను అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించింది.

దివ్యాంగులు ఓటు వేసేందుకు ఈ సారి పోస్టల్‌ బ్యాలెట్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని దివ్యాంగులు వినయోగించుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.

పించను పెంచిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు అంతకంటే గొప్ప వార్తనే వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయనున్న గృహలక్ష్మి పథకంలో ఐదు శాతం.. రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.నిరుపేదలకు సర్కారు డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే.. సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే పేదల కోసం గృహలక్ష్మి పథకంలో భాగంగా మూడు లక్షల ఆర్థిక సాయం అందించనుంది.

ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది. ఈ క్రమంలోనే.. గృహలక్ష్మి పథకం కింద మొత్తం 4 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో ఒక్కో నియోజకవర్గానికి 3 వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇళ్లు నిర్మించనుండగా.. మరో 43 వేల ఇళ్లకు రాష్ట్ర కోటాలో అనుమతి ఇవ్వనున్నారు. ఈ పధకంలో కూడా దివ్యాంగులకు అయిది శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు.

(కధనం: ప్రతాప్)