Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ ఏడాది చివర్లో భారత్ లో మరో ప్రళయం

2020 .. నిజంగానే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరితో ట్వంటీ ట్వంటీ ఆడుకుంటుంది. ఏ ముహూర్తంలో ఈ ఏడాది ప్రారంభం అయ్యిందో కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా మంచిగా జరగడం లేదు. ముఖ్యంగా కరోనా మహమ్మారి దెబ్బకి ప్రపంచం మొత్తం షట్ డౌన్ లోకి వెళ్ళింది. స్కూల్స్ అన్ని మూతబడ్డాయి. పనులు లేక కార్మికులు అల్లాడిపోతున్నారు. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరిని ఈ మహమ్మారి వణికిస్తుంది. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో 2020 సంవత్సరం చివరినాటికి మరో పెను ప్రమాదం ఉందని అతి పెద్ద భూకంపం హిమాలయాల ప్రాంతంలో రానుందని పరిశోధకులు వెల్లడించారు.హిమాలయాలు మన దేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటూ ‘రుతు పవన తరహా శీతోష్ణస్థితి’ కి కారణంగా నిలుస్తుంది.
దేశానికి కిరీటంగా పిలవబడే హిమాలయాల్లో భూ కంపం సంభవించే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. జర్నల్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ లెటర్స్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. భౌగోళిక చారిత్రక మరియు భౌగోళిక డేటా పరిగణలోకి తీసుకున్నారు పర్వత ఉపరితలాలను మరియు మట్టిని పరిశీలించినట్లు జర్నల్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ లెటర్స్ లో ప్రచురించారు.ఈ పరిశోధనలో కీలకంగా ఉన్న పరిశోధకుడు స్టీవెన్ జి. వోస్నోస్కి మాట్లాడుతూ హిమాచల్ ప్రాంతం తూర్పున భారతదేశానికి మరియు పశ్చిమాన పాకిస్తాన్ వరకు విస్తరించి ఉంది కాబట్టి దాని ప్రభావం రెండు దేశాలకు ఉండవచ్చని గతంలో సంభవించిన భూకంపాలకు ఈ ప్రాంతం అనేక పెద్ద భూకంపాలకు కేంద్రంగా ఉందని తెలిపారు. ఈ విపత్తు సంభవిస్తే .. చండీగఢ్ మరియు డెహ్రాడూన్ మరియు నేపాల్ లోని ఖాట్మండు వంటి పెద్ద నగరాలకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు