Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

చంద్రయాన్ -3 విజయంతో దేశం గర్విస్తోంది

ఆలేరు ఆగస్టు 24 (నిజంచెపుతాం)

చంద్రయాన్ 3 విజయవంతమైనందున దేశమంతా గర్వపడుతుందని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కోటగిరి శేఖర్ అన్నారు.చంద్రయాన్ 3 విజయవంతమైన సందర్భంగా గురువారం ఆలేరు ఎన్సిసి యూనిట్ ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

చంద్రుడు దక్షిణ ధ్రువం పై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అయినందుకు,ఇస్రో శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలుపుతున్నామని,చరిత్ర సృష్టించిన సందర్భంగా దేశం గర్వపడుతుందని అన్నారు.

అగ్రదేశాలకు సైతం కొరకరాని కొయ్యగా మారిన దక్షిణా ధ్రువం పై భారత్ అవలీలగా అడుగులు వేసిందని,అది మన శాస్త్రవేత్తల అంకిత భావానికి,గొప్పతనానికి నిదర్శనమని అన్నారు.

ఎన్సీసి అధికారి దూడల వెంకటేష్ మాట్లాడుతూ స్వయంకృషితో హాలీవుడ్లో నిర్మించే చిత్రాల కంటే తక్కువ ఖర్చుతో మన శాస్త్రవేత్తలు ఈ మిషన్ ను పూర్తి చేయడం మామూలు విషయం కాదని,పాతికేళ్ల కలను మన శాస్త్రవేత్తలు నెరవేర్చారని, వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు.

ఈ సందర్భంగా ఎన్సిసి క్యాడేట్ల ద్వారా ఇస్రో అనే అక్షరాలు రూపొందించి వారికి అభినందనలు తెలుపుతున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళి, మంద సోమరాజు, సాంబశివ, నవీన్, ఖాజా అలీ, రవి, లక్ష్మమ్మ, కవిత ,మేరీ, స్వర్ణలత, విజయలక్ష్మి, మీరా, దుర్గమ్మ, క్యాడెట్లు కమ్మంపల్లి శ్రీజస్విని, సీస వైష్ణవి, భాను, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.