Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సదాశివపేట్ శాంతినికేతన్ పాఠశాలలో అంబరాన్నంటిన సంబరాలు

విద్యార్థుల కేరింతలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు…

చంద్రయాన్ 3 ఘనవిజయంలో విజయోత్సవ సంబరాలు.

సంగా రెడ్డి ఆగస్టు 24 (నిజం చెపుతాం.)

ప్రపంచం గర్వించేలా నా భారతదేశం, నాదేశం వైపుకు చూశేలాగ, చంద్రమండలం దక్షిణ ధ్రువం పైన మొట్టమొదట తన ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తల యొక్క కృషి అభినందనీయమని, ప్రతి భారతీయుడు తన దేశ త్రివర్ణాపతకం చంద్రమండలంపై ఎగరడం పట్ల అందరికీ సగర్వంగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని చేబూని గ్రామంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు . అనంతరం ఏర్పాటుచేసిన బాలసభలో విద్యార్థులు చంద్రయాన్ వివరాలను వివరించారు.

తాము కూడా ఇస్రోశాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థితికి వస్తామని తమ ఆశలను ఆశయాలను వ్యక్తపరిచారు. ఇంతగొప్ప కార్యక్రమంలో మన సంగారెడ్డి జిల్లా వాస్తవ్యుడు నారాయణఖేడ్ వంకదల్ కు చెందిన ప్రవీణ్ పాటిల్ ఉండటం ఆనందదాయకంఅన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.