Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయిన్

సినిమాలు విడుదలై కొన్ని విజయాలు సాధిస్తే మరికొన్ని ఫ్లాప్ గా నిలుస్తాయి.. వరుసగా ప్లాఫ్ లో ఉన్న హీరోలకు కొంతమంది హీరోయిన్లు లక్కీ హీరోయిన్ గా మారుతుంటారు. అది మామూలే.  కానీ ఒకటే ఫ్యామిలీకి చెందిన వారికి అన్ని హిట్లు ఇచ్చి లక్కీ హీరోయిన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసా??

ఆ స్టార్ హీరోయిన్ మెగా  హీరోలకు వరుసగాహిట్లు అందించింది..

వరుసగా హిట్లను అందించిన హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం…ఆమే

శృతిహాసన్.. 

 

శృతిహాసన్ నటించిన సినిమాలలో తనదైన స్టైల్ లో తన గ్లామర్ లుక్స్ తో ప్రేక్షకులను అలరించే ఆకట్టుకుంటుంది.. శృతిహాసన్ ఫ్లాప్ సినిమాలతో ఉన్న మెగా హీరోలకు మంచి సూపర్ డూపర్ హిట్లు అందించింది.. ఆ సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఏవో చూద్దాం…

1.. గబ్బర్ సింగ్…

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా సినిమాతో మంచి హిట్ అందుకున్న పవర్ స్టార్ ఆ తర్వాత నటించిన పంజా, కొమరం పులి, తీన్మార్ వంటి సినిమాలు ఫ్లాపలుగా నిలిచాయి..

ఈ సినిమాల తర్వాత 2012 మే 11న గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది.. ఈ సినిమాకు డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు..

ఈ సినిమాలో హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోయిన్గా శృతిహాసన్లు ముఖ్యపాత్రలు పోషించారు.. ఈ సినిమాకు 30 కోట్లు బడ్జెట్ పెట్టి నిర్మించగా ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి 150 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబట్టింది.. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు..

2. ఎవడు.. 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తుఫాన్ సినిమా విడుదలై అనుకున్నంత స్థాయిలో ఆడకపోగా రాంచరణ్ కు ఇది పాత సినిమాగా మిగిలిపోయింది..

2014 జనవరి 12న రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమా విడుదల అయింది.. ఈ సినిమాకి డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోగా, హీరోయిన్ గా శృతిహాసన్, అమీ జాక్సన్, కాజల్ అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషించారు..

ఎవడు సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఒక మంచి కంబ్యాక్ సినిమాగా ఉంది..

ఈ సినిమా పూర్తిగా ఆక్షన్ అండ్ థ్రిల్లర్ గా ఉంటుంది.. ఈ సినిమాను 35 కోట్లు పెట్టి నిర్మించారు.. ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ విజయాన్ని అందుకుంది..

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 60 కోట్లు కలెక్షన్లలో తెచ్చిపెట్టింది.. తుఫాన్ సినిమాతో ఫ్లాప్ లో ఉన్న రాంచరణ్ కు ఎవడో సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ తో మంచి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు..

3. రేసుగుర్రం..

 

అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలు సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. ఇద్దరమ్మాయిలు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా అల్లు అర్జున్ కు డిజాస్టర్ గా నిలిచిపోయింది..

2014 ఏప్రిల్ 11న విడుదలైన రేసుగుర్రం సినిమా అల్లు అర్జున్ కు మంచి కంబ్యాక్ ఇచ్చింది.. ఈ సినిమాకు డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.. ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ హీరోయిన్ గా శృతిహాసన్ ,శ్యామ్, రవి కిషన్ లు ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ సినిమా పూర్తిగా యాక్షన్  కామెడీ డ్రామాగా ఉంటుంది… ఈ సినిమాకు 52 కోట్లు పెట్టి నిర్మించగా ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద 101 కోట్ల రూపాయలు కలెక్షన్లను వసూలు చేసింది..

ఇద్దరమ్మాయిలు సినిమాతో ఫ్లాప్ లో ఉన్న అల్లు అర్జున్ కు రేసుగుర్రం సినిమాలో శృతిహాసన్ తో నటించి మంచి సూపర్ డూపర్ హిట్టును అందుకున్నారు..

మెగా హీరోలందరికీ శృతిహాసన్ ఒక లక్కీ హీరోయిన్ గా ముద్ర పడిపోయింది..