Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యూరియా కొరత సృష్టిస్తున్న ఫర్టిలైజర్ డీలర్స్..?

ఒక్క యూరియా బస్తా అధిక రేట్లకు విక్రయిస్తున్న డీలర్స్

పట్టించుకోని వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు

లైసెన్స్ పాయింట్ లేని గోదాంలు ఎన్నో ..

నేరేడుచర్ల ఆగష్టు 24(నిజం చెపుతాం):

రైతులు పంటలు ఎండిపోతున్నాయని తీవ్ర ఆందోళన ఉన్న రైతులు కాస్తో కూస్తో ఉన్న పంటను కాపాడుకుందామని యూరియా కోసం డీలర్ షాప్ దగ్గరికి వెళ్లి యూరియా బస్తాను అడిగితే 300 నుంచి 360 అయితేనే ఇస్తామని మేం బ్లాక్ లో కొనుక్కొని వచ్చామని రెండు వందల అరవైఆరు రూపాయలు పడే యూరియా బస్తా మాకే ఎక్స్ రేట్లకు హోల్ సేల్ డీలర్స్ అమ్ముతున్నారని డీలర్లు చెప్తున్నారు. దీంతో రైతులు కంగు తింటున్నారు.

నేరేడుచర్ల మండల వ్యవసాయ అధికారి దుకాణాలపై సరిగా నిఘా వేయకపోవడంతో ఈ కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

పక్క మండలం వ్యవసాయ అధికారికి ఇన్చార్జి ఇస్తే తాను సరిగ్గా రాకపోవడం వల్ల నేరేడుచర్ల మున్సిపాలిటీలోని డీలర్లు చెలరేగిపోతున్నారు

గరిడేపల్లి మండలం పెద్దది కావడంతో అక్కడున్న వ్యవసాయ అధికారి ఇక్కడ ఇన్చార్జి కావడంతో తన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

నేరేడుచర్ల మున్సిపాలిటీ లోని ఫర్టిలైజర్ లో ఒక బస్తా యూరియ ఆ 300 నుంచి 360 రూపాయలు అమ్ముతున్నారు ఒక రైతు నిజం న్యూస్ కు తెలియజేశారు.

యూరియాని బ్లాక్ చేసి అమ్ముతున్న ఫర్టిలైజర్ డీలర్ల వైఖరితో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈరోజు పలువురు రైతులు డీలర్ షాప్స్ దగ్గరికి వెళ్తే మా దగ్గర ఏ యూరియా లేదు మాకు హోల్సేల్ డీలర్లే ఎగస్ట్రా రేట్ కి అమ్ముతున్నారు కానీ మీ 300 నుంచి 300 రూపాయల 30 రూపాయలతో దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అందుకనే అధిక రేటుకు అమ్మవాల్సి వస్తుందని అంటున్నారు