Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హుజూర్‌నగర్ లో అనధికారిక ఫెస్టిసైడ్స్ నిల్వలు..?

ఫెస్టిసైడ్ కంపనీల ప్రతినిధుల ఫిర్యాదు

వ్యవసాయ,రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో విచారణ

తాత్కాలికంగా రెండు గోడౌన్ల సీజ్

హుజూర్‌నగర్, ఆగస్టు 24 (నిజం చెపుతాం)

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న లక్ష్మీ సీడ్స్ ఫెర్టిలైజర్స్ షాపుకు సంబంధించిన రెండు గోడౌన్ లలో అనధికారికంగా ఫెస్టిసైడ్స్ నిల్వలు చేశారని ప్రముఖ ఫెస్టిసైడ్స్ కంపనీల ప్రతినిధులు ఆరోపించారు.

అనధికారక‌ నిల్వలపై విచారణ చేపట్టాలని వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈమేరకు గురువారంవ్యవసాయ,రెవిన్యూ శాఖ అధికారులు రెండు గోడౌన్లను తనిఖీ చేసి విచారణ చేశారు.కాగా ఆరెండింటిలో లక్షలాది రూపాయల పురుగుల,కలుపు నివారణ మందులు ఉన్నట్లు గుర్తించారు.

ఇదిలా ఉండగా ఆ గోడౌన్లకు ఎటువంటి నేమ్ బోర్డ్స్,బ్లాక్ నంబర్స్ లేకపోవడం, షాపుకు సంబంధించిన యజమాని అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

విచారణ అనంతరం వ్యవసాయ అధికారి స్వర్ణ మాట్లాడుతూ గోడౌన్లలో అనధికారిక నిల్వలు గుర్తించామన్నారు.వాటికి సంబంధించిన ఇన్ వాయిస్,ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు పరిశీలించి,ఎక్కడనుండి తీసుకొచ్చారనే విషయాన్ని తేలుస్తామన్నారు.

ఇందులో ఎటువంటి లోపాలున్నా కేసులునమోదుచేస్తామన్నారు.

అనుమానాలుంటే అవి ఒరిజనల్ లేదా నకిలీవా నిర్దారించడానికి శాంపిల్స్ ల్యాబ్ కు కూడా పంపుతామని చెప్పారు.ఫెస్టిసైడ్స్ కు సంబంధించి రషీదులు,పేపర్లు పరిశీలించేవరకుతాత్కాలికంగా గోడౌన్లకు తాళాలు వేసి సీజ్ చేశారు.

విచారణలో మండల వ్యవసాయాధికారిస్వర్ణ,తహశీల్దార్ నాగార్జున రెడ్డి,ఆర్ఐ షరిష్,ఏఈవో నరేష్,ఫెర్టిలైజర్ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.