Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏపీ లో ఓటర్ల జాబితా పూర్తి స్థాయి తనిఖీ 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. వివిధ రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయినందుకుంటున్నాయి.

ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఒక కీలక పరిణామం తాజాగా చోటు చేసుకుంది. అయితే ఓటర్ల జాబితాలో తీవ్ర అవకతవకలు జరిగాయన్న విపక్షాల ఆరోపణలపై ఎలక్షన్ కమీషన్ వెంతనే స్పందించింది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఓటర్ల జాబితాలను తనిఖీ చేయాలని ఈర్వోలను ఆదేశించింది. ఇటీవల అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజక వర్గం పరిధిలో ఓటర్ల తొలగింపు ఉదంతం బయటపడడంతో ఈసీ ఆదేశాలతో ఇద్దరు అధికారులపై వేటు పడింది.

అయితే ఎలాగైనా తిరిగి అధికారం లోకి వచ్చేందుకు అధికార పార్టీ ఈ తరహా కుట్ర పన్నిందని , రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ఘటనలు జరిగాయని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాయి.

2022 జనవరి నుండి ఓటర్ల జాబితాలో అన్ని రకాల ఓట్ల తొలగింపులపై రీ-వెరిఫికేషన్‌ చేపట్టేలా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు.

ఓటర్ల జాబితా స్వచ్ఛతను నిర్ధారించే క్రమంలో ఎలక్టోరల్ రోల్ తయారీ, నిర్వహణ ప్రక్రియలో అవలంబించే విధానాలు, జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం, సవరించడం వంటి అంశాలు పారదర్శకంగా ఉండేలా ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ఈ ప్రక్రియ తోడ్పడుతుందని విపక్ష తెలుగుదేశం, బిజెపి, జనసేన హర్షం వ్యక్తం చేస్తుండగా , ఈ ఉదంతంలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని అధికార పార్టీ చెబుతోంది.

17 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న యువకులు ఇప్పుడు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఎన్నికల సంఘం తమ వెబ్ సైట్ లో పలు వివరాలను పొందుపరచింది.

సంవత్సరం లో జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండాలన్న నిబంధన కోసం వేచి ఉండాల్సిన అవసరం ఇక లేదు

జనవరి 1వ తేదీనే కాకుండా ఏప్రిల్ 01, జూలై 01, అక్టోబర్ 01 తేదీలకు సంబంధించి తమ అడ్వాన్స్ దరఖాస్తులు దాఖలు చేయడానికి యువతకు వీలు కల్పించే విధంగా సాంకేతిక ఆధారిత పరిష్కారాల ను రూపొందించాలని అన్ని రాష్ట్రాల సిఇఓలు/ఈఆర్ వోలు/ఏఈ

ఆర్ వోల ను ఈసీఐ ఆదేశించింది. 2023 ఏప్రిల్ 1, జూలై 1, 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ఏ పౌరుడైనా ఓటరు జాబితా ముసాయిదా ప్రచురణ తేదీ నుంచి ఓటరుగా నమోదు కోసం ముందస్తు దరఖాస్తును సమర్పించవచ్చు అని ఎన్నికల సంఘం తెలిపింది.

(కధనం: ప్రతాప్)