Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కె.చంద్రశేఖర్ రావు రైతు వేదికను ప్రారంభిస్తారు.

జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మద్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సిఎం సందర్శిస్తారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు. ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను ముఖ్యమంత్రి వివరిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.