Warning: preg_match_all(): Compilation failed: quantifier does not follow a repeatable item at offset 64 in /home/customer/www/nijamnews.in/public_html/wp-content/plugins/seo-by-rank-math/includes/replace-variables/class-post-variables.php on line 545
కమ్యూనిస్టుల దారెటు ??? - Nijam News
Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కమ్యూనిస్టుల దారెటు ???

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కమ్యూనిస్టులకు షాక్ ఇచ్చారు. పొత్తులపై కామ్రేడ్‌లు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లారు.

మారిన రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టులతో పొత్తు కన్నా..వారు వేరుగా పోటీ చేయడమే తమకు కలిసి వస్తుందని కేసీఆర్ భావించారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

బి ఆర్ ఎస్ ప్రకటించిన తొలి విడత జాబితాలో ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు ప్రసక్తి లేదు.

జాబితా ప్రకటించిన తర్వాత కమ్యూనిస్టులతో పొత్తు ప్రసక్తే ఉండదని కుండ బద్దలు కొట్టారు.

ఈ పరిణామంపై ఉభయ కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. కె సి ఆర్ కనీసం మిత్ర ధర్మం పాటించి వుండాల్సిందని అవి అభిప్రాయపడ్డాయి.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని, ఇది మేం ఊహించని పరిణామమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

మునుగోడులో ఆయనే మద్దతు అడిగారు. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పని చేస్తామని చెప్పారు. సిఎం కెసిఆర్ ఏకపక్షంగా అభ్యర్థుల జాబితా ఇచ్చారు.

మేం అడిగిన సీట్లలో కూడా అభ్యర్థులను ప్రకటించారు. పైగా మాతో పొత్తు వుండదని ఏకపక్షంగా ప్రకటించారు.

అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. “బిజెపితో సిఎం కెసిఆర్ కు సఖ్యత వచ్చింది.

మునుగోడులో బిజెపి ప్రమాదమని చెప్పిన కెసిఆర్‌కు బిజెపితో మిత్రుత్వం ఎక్కడ కుదిరింది?. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బిఆర్ఎస్ ఏమయ్యేది.

రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. మేము కూడా గెలవడానికి తుదివరకు పోరాడుతాం. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం” అని అన్నారు.

సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపులో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 నుంచి 65 లక్షల దళితుల జనాభా ఉందన్నారు.కాగా మాలలకు కేవలం 7 సీట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు.

ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొత్తులపై స్పందించకపోవడంతో ఇప్పుడు కమ్యూనిస్టుల దారి ఏటనేది ఆసక్తిగా మారింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం భాగంగా ఉన్నాయి.

దీంతో తెలంగాణలోనూ కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో వెళ్తారా.. లేదా ఒంటరిగానే బరిలో దిగుతారా.. అనేది త్వరలోనే తేలుతుందని రాజకీయ వర్గాలలో చర్చ జోరుగా జరుగుతోంది.

(కధనం: ప్రతాప్)