ఎమ్మెల్యే కిషోర్ కు స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు
భారీ గజమాలతో ఎమ్మెల్యే కిషోర్ కు స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు
అర్వపల్లి ఆగస్టు 23 నిజం చెపుతాం న్యూస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ప్రకటించడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఎమ్మెల్యే వచ్చారు
ఘన స్వాగతం పలికిన తుంగతుర్తి నియోజకవర్గ కార్యకర్తలు. దేవాలయంలో ప్రత్యేక పూజలు. జెడ్పిటిసి దావుల వీరప్రసాద్ ఆధ్వర్యంలో క్రేన్ సహాయంతో భారీ గజమాల, బాణాసంచా లతో అపూర్వ స్వాగతం. పలికారు 2 వేల బైకులతో తిరుమలగిరి కి ర్యాలీగా వెళ్లిన నియోజకవర్గ వర్గ నాయకులు కార్యకర్తలు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి ఎన్ని కుట్రలకు తంత్రాలు పలికిన హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కార్యకర్తలను కోరారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే తెలంగాణ అభివృద్ధికి సాధ్య పడుతుందని అన్నారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు….