Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సంక్రమిత వ్యాధుల బారినపడకుండా జాగ్రతలు పాటించాలి

మోతె ఆగస్టు 22 (నిజం చెబుతా న్యూస్):-

గొళ్ళా లు పాత కూలర్ లు సెప్టిక్ ట్యాంక్ లలో దోమలు బాగా వృద్ధి చెందె అవకాశం ఉన్నందున వాటిని లార్వా దశలో వాటిని వృద్ధి చెంద కుండా నివారించాలని ఈగలు వాలిన ఆహార పదార్థాలను నీటిని తాగిన అతిసార వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుందని మలేరియా టైపాయిడ్ డెంగ్యూ లాంటివి నిర్ధారించడానికి ర్యాపిడ్ కిట్ల తో టెస్ట్ లు చేస్తున్నామని వైద్యాధికారి వై నాగరాజు అన్నారు.

గర్భిణి స్త్రీలకు పోషకాహర లోపం లేకుండా రక్త హీనత రాకుండా కాపాడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య సిబ్బంది దే అని అన్నారు పసి పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం తీసుకునే విధంగా ప్రోత్సహించాలని కోరారు

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రకాష్ రావు యం పి డి ఓ వెంకటా చారి వైద్యాధికారి వై నాగరాజు హెల్త్ సూపర్ వైజర్ కమలమ్మ స్టాప్ నర్స్ నాగమణి పార్మసీస్ట్ రాణి ఆయుస్సు వెంకన్న తదితరులు పాల్గొన్నారు