Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వయ్యారిభామ నిర్మూలన వారోత్సవాలు

అవగాహన కల్పిస్తున్న గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్తలు

గరిడేపల్లి ఆగస్టు 22 (నిజం చెపుతాం)

పార్థినియమ్ నిర్మూలన వారోత్సవాల లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లో మంగళవారం నాడు ఆఖరి రోజు పార్థినియం (వయ్యారి భామ) వలన కలిగే అనర్ధాలు మరియు వాటి నిర్మూలన వలన కలిగే లాభాలను కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. పార్థీనియం అనేది ఒక హానికరమైన, ప్రమాదకరమైన కలుపు మొక్క దీని విష ప్రభావాల వల్ల మానవులకు మరియు జీవవైవిధ్యానికి ఎంతో హాని చేస్తుంది అని కేవీకే శాస్త్రవేత్త డి ఆదర్శ్ తెలిపారు.

ఈ కలుపు మానవులకు ఆస్తమా, చర్మ సంబంధమైన అలెర్జీ వంటి వ్యాధులను కలుగచేస్తుంది. పార్థీనియం కలుపు జంతువులకు విషపూరితమైనది, ఇది పశువులతో సహా వివిధ జంతువులపై చర్మపు గాయాలతో చర్మశోథను కలిగిస్తుంది.

ఇది తింటే, అధిక లాలాజలంతో నోటి పూతలకి బాధ్యత వహిస్తుంది. పుప్పొడి గింజలు, గాలిలో ఎండిన మొక్క భాగాలు మరియు పార్థీనియం యొక్క మూలాలు మానవులలో కాంటాక్ట్ డెర్మటైటిస్, జ్వరం, ఆస్తమా మరియు బ్రోన్కైటిస్ వంటి వివిధ అలెర్జీలకు కూడా కారణమవుతాయి.

దీనినీ పూత దశకు చేరకముందే నాశనం చేయాలి. దీని విపత్తు మరియు పర్యావరణ పర్యవసానాల గురించి, డైరక్టరేట్ ఆఫ్ కలుపు పరిశోధన సంస్థ, జబల్‌పూర్ వారు

ప్రతి సంవత్సరం పార్థీనియం అవగాహన వారాన్ని ఆగస్ట్ 16 నుండి ప్రారంభించి 22 వరకు అన్ని కేవికే లు ఇతర ప్ర బుత్వ సంస్థల తో నిర్వహించి జీవవైవిధ్యం, మానవులు మరియు జంతువుల ఆరోగ్యంపై దాని దుష్ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పిస్తుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కె.వి.కె శాస్త్రవేత్తలు డి నరేష్, డి ఆదర్శ్, ఏ కిరణ్, సిహెచ్ నరేశ్, డా||టీ మాధురి, యన్ సుగంధి, 15 మంది బిఎస్సి వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు.