Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జగిత్యాలలో బతుకమ్మలాడి ఏఎన్ఎం ల నిరసన

జగిత్యాల టౌన్ ఆగస్టు 22(నిజం చెపుతాం )

ప్రజల సుభిక్షం కోసం తల్లి, బిడ్డల ఆరోగ్యంతో పాటుఅన్ని రకాల వ్యాధుల నిర్ములనకు పనిచేస్తున్న తెలంగాణ అడబిడ్డలమైన కాంట్రాక్ట్ ఏఎన్ఎంల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం బాధాకరమని ఏఐటియూసి అనుబంధ తెలంగాణ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురిమ అన్నారు.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏ ఎన్ ఎం లను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ తో జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు జగిత్యాల జిల్లాలోని ఏ ఎన్ ఎం లు చేస్తున్న సమ్మె మంగళవారం 7వ రోజుకు చేరింది.

గాండ్ల మధురిమ ఆధ్వర్యంలో నడుస్తున్న దీక్ష శిబిరంలో రంగు రంగుల పూలతో పేర్చిన బతికమ్మలను తహశీల్ చౌరస్తాలోని రోడ్డుపై పెట్టి బతుకమ్మ ఆడి ఏ ఎన్ ఎం లు తమ నిరసనను తెలియజేశారు.
బతుకమ్మ ఆడుతుంటే ప్రజలు కూడా మద్ధతు తెలిపారు. ఈ సందర్బంగా మధురిమ, పలువురు ఏఎన్ఏం లు మాట్లాడుతూ ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడమే కాకుండా మా శాఖలో ని మేల్ కాంట్రాక్ట్ ఏ ఎన్ ఎం లను కొన్ని నెలల క్రితం రెగ్యులరైజు చేసిన ప్రభుత్వం మేము ఎం పాపం చేశామని విమర్శిస్తూ ,మేము మహిళలం అయినoదుకేనా మాకి గోస అంటూ మండిపడ్డారు.

బాలింతలు, పుట్టిన బిడ్డ ,గర్భిణిలు, వృద్ధులు,అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ బిపి, షుగర్, వ్యాక్సిన్ తదితర ఆరోగ్య సేవలు అందిస్తూ ప్రజా గొంతుకగా ఉంటున్న మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణమన్నారు.

కరోనా సమయంలో ప్రాణాలు లెక్కచేయకుండా వ్యాధి నిర్ములనకు పాటుపడ్డ వారి పట్ల ప్రభుత్వం కనికరం చూపకపోవడం సమంజసం కాదని మధురిమ పేర్కొన్నారు.
జులై నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి, ఎలాంటి ఆంక్షలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి మా న్యాయమైన ఒకే ఒక్క డిమాండు సర్వీసును క్రమబద్ధీకరించాలని మధురిమ కోరారు.
ఈ కార్యక్రమంలో ఏ. పద్మ, శిరీష, నీరజ, పి. శిరీష,జమున,స్వరూప, చిలుకమ్మ, సునీత, సౌజన్య, మేరీ, ఎలిజబెత్ రాణి, ఊర్మిల, జ్యోతి, ప్రమీల, షాహిన్, రాజేశ్వరి, గణిత, సరిత, మాలతి, కల్యాణి, రాజమని, ప్రశాంతి, మహేశ్వరి,రమా, సుజాత,కోమల,రాజశ్రీ, ఏఐటీయూసి నాయకులు ముఖరం, సురేష్, శాంత,
ఎన్నం రాధ,ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.