అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాల పండుగ
-బోనాల సమర్పణ వల్ల గ్రామ దేవతలు శాంతించి అంటూ వ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల నమ్మకం
వనపర్తి బ్యూరో ఆగస్టు 22 ( నిజం చెపుతాం ) పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలోని చెలిమిల్ల, కిష్టారెడ్డిపేట వార్డులలో మంగళవారం రోజు శ్రావణ మాసంలో పోచమ్మ బోనాలతో గ్రామ ప్రజలు కనువిందు చేశారు.
ఇక్కడి గ్రామ ప్రజలకు తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం ఆ బోనాన్ని ఒక కొత్త మట్టి కుండలో వండుతారు. చిన్న ముంతలో పానకం పోస్తారు.దానిపై దివ్య పెట్టి బోనం జ్యోతిని వెలిగిస్తారు.
ఇలా వండిన బోనం కొండలకి సున్నము,పసుపు,కుంకుమ, వేపాకులు పెడతారు.
ఈ విధంగా వండిన బోనం ఎంత పవిత్రమైనదో అంతే శుభ్రమైనది.వండిన బోనానికి సున్నం,పసుపు,వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు ఇందులో వాడిన పసుపు,సున్నం,వేపాకులు, ఇవన్నీ యాంటీ సెప్టిక్ ఆంటీ బైయోటిక్ కి సంబంధించినవే
కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలు బోనం లోపలికి వెళ్లే అవకాశం ఉండదు అందువలన ఈ బోనానికి ఇంత పవిత్రత,శుభ్రత ఉంటుంది.
అలా కొత్త కుండలో వండిన బోనాన్ని ఎత్తుకొని ప్రదర్శనంగా తీసుకొని వెళ్లి గ్రామ దేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు.ఇలా గ్రామ ప్రజలు గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్లి బోనాలు సమర్పిస్తారు.
భక్తులు మా ఊరి గ్రామ ప్రజలకు ఎలాంటి కీడు జరగకుండా సంతోషంగా ఉండాలని మొక్కలు తీర్చుకుంటారు.
బోనాల సమర్పణ వల్ల గ్రామ దేవతలు శాంతించి అంటూ వ్యాధులు రాకుండా పిల్లలు పెద్దలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని దీవిస్తూ కాపాడుతారని ప్రజల నమ్మకం.