Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నోడల్ అధికారులు ఎన్నికల విధులను పటిష్టంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ కె, శశాంక.

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఆగస్టు22, (నిజం న్యూస్):

ఎన్నికల విధులు కేటాయించిన నోడల్ అధికారులు పూర్తి అవగాహనతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.మంగళవారం ఐ.డి.ఓ.సి.లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు. నిర్వహించేందుకు 19 విభాగాలకు అధికారులను నియమిస్తూ సమన్వయంతో విధుల నిర్వహణలో చేపట్టాల్సిన బాధ్యతాయుత పనులను తెలియజేసారు.
ఎం.సి.సి. అధికారిగా పశుసంవర్ధక శాఖ అధికారి సుధాకర్ ను, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ అధికారిగా జడ్పి సి.ఈ.ఓ.రమాదేవితో పాటు జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి హైమావతి లకు విధులు కేటాయించారు.
అలాగే ఈ టి పి బి ఎస్ అధికారిగా గ్రౌండ్ వాటర్ అధికారి సురేష్ కు, మెటీరియల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి నర్మద, ఎన్నికల నిర్వహణకు శిక్షణ అధికారిగా జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సూర్యనారాయణ, హెచ్.ఆర్.అధికారిగా ముఖ్య ప్రణాళిక అధికారి పి. సుబ్బారావు ను,

సంక్షేమ అధికారిగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్,వోటింగ్, పోలింగ్ సిబ్బంది ఏర్పాటుకు జడ్పి సి.ఈ.ఓ.రమాదేవి, ఫిషరీస్ అధికారిణి నాగమణి, ఈ.వి.ఎమ్., వి.వి.పాట్ లకు అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్.రవాణాకు జిల్లా రవాణా అధికారి రమేష్ రాథోడ్,

స్వీప్ అధికారిగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సన్యాసయ్య, లా అండ్ ఆర్డర్ అధికారిగా అదనపు ఎస్పీ చెన్నయ్య, బ్యాలట్ పేపర్ అధికారిగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నరసింహ మూర్తి, మీడియా కోఆర్డినేషన్ అధికారిగా డి.పి.ఆర్.ఓ. శ్రీనివాసరావు, ఐటి అధికారిగా

ఈ.డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రశాంత్ కుమార్, అబ్జర్వర్ లకు కో ఆర్డినేషన్ అధికారిగా ఈడీ ఎస్సి కార్పొరేషన్ అధికారి బాలరాజు, ఫిర్యాదులు పై స్పందించుటకు సి.పి.ఓ.కార్యాలయ అధికారిని విజయలక్ష్మి,

ఏ ఎం టి అధికారులు గా మహబూబాబాద్ ఆర్డీఓ అలివేలు, తొర్రుర్ ఆర్డీఓ నరసింహారావు,కమ్యూనికేషన్స్ అధికారిగా జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు నర్సింహ మూర్తి లను నియామకం చేశారు.
నియమించిన అధికారులు ఎన్నికల విధులను పారదర్శకంగా, జవాబు దారితనంతో అంకితభావంతో పనిచేయాలన్నారు.
ములుగు నియోజకవర్గంలోని గంగారాం, ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండలాలలో సిగ్నల్స్ పై ఆయా ప్రాంతాలలో దృష్టి పెట్టాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జడ్పి సి.ఈ.ఓ. విధులు కేటాయించిన సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.