Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రైతుల వద్దకు వచ్చి పంట కొనుగోలు చేస్తాం

*250 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
*32 లక్షల బ్యాగులు సిద్ధం
* 50 లక్షలు గన్ని బ్యాగులు అవసరం
*నవంబర్ మొదటివారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
*సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
*రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
మన్యం టీవి,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ, మార్కుఫెడ్, పౌరసరఫరా శాఖల అధికారులతో కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించిన వానాకాలం 2020-21 ధాన్యం కొనుగోలు, యాసంగి పంటల సాగు, కార్యాచరణ ప్రణాళిక పై జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రివ్యూ సమావేశంకు ముఖ్య అతిధిగా హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు.రైతుల వద్దకు వచ్చిపండించిన పంట ప్రతి గింజ ప్రభుత్వ మే కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా
మొత్తం 250 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 50 లక్షలు గన్ని బ్యాగులు అవసరం ఉండగా32 లక్షల బ్యాగులు సిద్ధం ఉన్నాయని అవసరం ఐతే చౌక దుకాణాల డీలర్ల నుండి బ్యాగ్ లు సేకరిస్తామన్నారు.నవంబర్ మొదటివారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ నున్నట్లు ఆయన పేర్కొన్నారు.పత్తి కొనుగోలుకు
సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
ఇతర జిల్లాలు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.కొనుగోలు కేంద్రాల్లో వేయింగ్ యంత్రాలు, టార్పాలిన్లు సిద్ధం ఉన్నాయని, పత్తి కొనుగోలు కు నెల్లిపాక అశ్వాపురం సుజాతనగర్ కారేపల్లి లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.ప్రతి క్లస్టర్ కు క ఒక కోయాష్కీని నియమిచడం జరిగిందన్నారు.ప్రభుత్వం వద్దన్నా 17 569 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చెయ్యడం జరిగింది అని బహిరంగ మార్కెట్ లో మొక్కలు మార్కెట్ లేక తక్కువ ధర పలుకుతుంది అని ఐనా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అన్నారు.పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి అని ,వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతిలో లాభసాటిగా చేయడానికి అధికారులు రైతుల ను చైతన్య పరచాలి అని అన్నారు.67 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాలు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలి అని ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో విప్ రేగా కాంతారావు ,జిల్లా కలెక్టర్ ఎన్ వి రెడ్డి,ఎస్పి సునీల్ దత్, ఐటీడీఏ పీవో గౌతం, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్ ,జిల్లావ్యవసాయ అధికారి అభిమన్యుడు, మార్కెటింగ్ ఏ డి నరేందర్ ,మార్క్ఫెడ్ డీఎం సుధాకర్ మున్సిపల్ చైర్మన్ సీతా లక్ష్మి రైతుబంధు జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.