Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిషేధిత గన్ పౌడర్ స్వాధీనం

తరిగొప్పుల ఆగస్టు 22 (నిజం చెపుతాం) అనుమతులు లేకుండా క్వారీలో పేలుడుకు వినియోగించే గన్ పౌడర్ తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు సీఐ నాగబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం మండలంలోని అంకుషాపూర్ పరిధిలోని మాన్సింగ్ తండా శివారులో వాహనాల తనిఖీ చేపడుతుండగా

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పురుకు చెందిన వల్లెపు నాగరాజు ,వల్లపు సమ్మయ్య జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగంపల్లి కి చెందిన సూర సారయ్య , చిల్పూరు మండలం లింగంపల్లి శివారు కొమ్ముగుంటకు చెందిన బొమ్మరాజులు మహీంద్రా మాక్సిమో ప్యాసింజర్ ఆటోలో క్వారీలలో ఉపయోగించే కిలోల గన్ పౌడర్ భువనగిరి జిల్లా నుండి మండలానికి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.

వారి వద్ద నుండి 480 కిలోల గన్ పౌడర్ పట్టుబడినట్లు తెలిపారు.

దీంతో సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.

ఒక ద్విచక్ర వాహనం మహేంద్ర మాక్సిమో వాహనాన్ని సీజ్ చేశారు. ఎస్సై దూదిమెట్ల నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.