Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దోమల వ్యాప్తి నివారణకు గంభూషియా చేపలు విడుదల

గుండాల ఆగస్ట్ 22 ( నిజం చెపుతాం )

గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిల్వ ఉన్న నీటిలో దోమల వ్యాప్తి నివారణకు దోమల లార్వాలను తినే గంభూషియా చేపలను విడుదల చేసే కార్యక్రమం నిర్వహించారు.

గుండాల పెట్రోల్ బంక్ ప్రాంతంలో, నరసాపురం గ్రామాలలో నిల్వ నేటి గుంటలో విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సర్పంచ్ కోరం సీతారాములు, ఎంపీవో హజరత్ వలి, సిహెచ్ఓ శ్రీహరి మాట్లాడుతూ.. ఈ చేపలు దోమల లార్వాలను తినడం వల్ల దోమలు వృద్ధి చెందకుండా నివారించవచ్చని తెలిపారు.

అదేవిధంగా దోమల వల్ల వచ్చే డెంగ్యూ,, మలేరియా ,చికెన్ గున్యా వంటి విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలను కాపాడవచ్చు అని అన్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

అనంతరం గ్రామాలలో డ్రైడే కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ ,మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సత్యం, ఏఎన్ఎం లు మంగ వేణి, మీనా, హెల్త్ అసిస్టెంట్ వి రాఘవులు , పంచాయతీ సిబ్బంది నాగరాజు, అనిల్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.