మావోయిస్టు నాయకులు మల్లా జాజిరెడ్డి కట్టా రామచంద్రారెడ్డి.. క్షేమమే
ఉత్తర సబ్ జోనల్ బ్యూరో.. మంగ్లీ
చర్ల ఆగస్టు 22 (నిజం చెపుతాం) భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) నాయకులు కామ్రేడ్ మల్లా జాజిరెడ్డి (సంగ్రామ్) కట్టా రామచంద్రారెడ్డిలు మరణించిన ట్లుగా ఆగస్టు 19న తెలుగు హిందీ దినపత్రికల్లో వచ్చిన అబద్ధపు వార్త కథనాలకు దండకారణ్యం లోని ఉత్తర సబ్ జోనల్ బ్యూరో బాకపా మావోయిస్టు తీవ్రంగా ఖండించింది.
మా మావోయిస్టు నాయకులు ఇద్దరు క్షేమంగా సురక్షితంగా ఉన్నారని వాళ్ళ క్షేమం సమాచారం కోసం ఆదుర్త గా ఎదురుచూస్తున్న యావత్ విప్లవ ప్రజానీకానికి సంస్థలకు వారిద్దరి కుటుంబ సభ్యులకు బంధువులకు లేక విడుదల చేశారు
ప్రజలను అయోమయంలో ముంచెత్తడానికి విప్లవ విజయాల పట్ల అవిశ్వాసం కలిగించడానికి మా నాయకుల ఆచారం తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు ఇంటిలిజెన్స్ ఉన్నత అధికారుల కనుసన్నల లో మా పార్టీ నాయకుల అనారోగ్యాల పట్ల తరచూ మీడియా అబద్ధ ప్రసారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు
ఇది మా పార్టీకి వ్యతిరేకంగా పాలకవర్గాలు చేపట్టిన మానసిక యుద్ధంలో భాగమే పాలకవర్గాలు చేసే ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని మేము ప్రజలకు తెలుపుతున్నామని లేఖ విడుదల చేశారు