డోర్నకల్ బిఆర్ఎస్ టికెట్ రెడ్యా కే
సొంత పార్టీ లోని చక్కర్లు కొడుతున్న అనుమానాలకు చెక్కు.
పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం.
సంబరాల్లో నియోజకవర్గ బిఅర్ఎస్ శ్రేణులు.
కురవి,నిజంచెపుతాం,ఆగస్టు,21:
డోర్నకల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కే మరోసారి టికెట్ ఛాన్స్ దక్కింది.
డోర్నకల్ నీయోజకవర్గంలో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా,ఒక పర్యాయం మంత్రిగా పనిచేసి, డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట గా మారు పేరున్న రెడ్యా నాయక్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అభివృద్ధి పేరుతో బిఅర్ఎస్ గూటికి చేరిన నాటి నుండి రెడ్యా నాయక్ పై ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమి చెందిన తాజా మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఇరువురి వర్గీయుల మధ్య పార్టీలో లో లోపల గ్రూప్ వార్ లు జరుగుతూనే ఉన్నాయి.
సత్యవతి రాథోడ్ కు మంత్రి పదవి దక్కడం,నియోజకవర్గంలో పాటు జిల్లాలో పార్టీ ముఖ్య నాయకులతో బలమైన క్యాడర్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు రాష్ట్ర గులాబి బాసులకు అత్యంత నమ్మకస్తురాలుగా ఉంటూ కేసిఆర్ మాటే వేద వాక్కుగా పనిచేస్తూ వస్తున్నారు.
సత్యవతి రాథోడ్ గతంలో ఎమ్మెల్యేగా నిలబడే టికెట్ అవకాశం తనకు నాయకత్వం కల్పిస్తే తాను డోర్నకల్ నుండే పోటీ చేస్తాననీ పత్రికా సుముఖంగా ప్రకటించడం నాటి నుండి నిన్నటి వరకు డోర్నకల్ బిఆర్ఎస్ టికెట్ సత్యవతి రాథోడ్ కు వచ్చే ఛాన్స్ ఉండొచ్చని,గత కొంతకాలంగా కొంతమంది ముఖ్య అనుచరుల తో పాటు ముఖ్యనేతల్లో కూడా ఈ మాట చాటుగా గుప్పు మని నియోజకవర్గంలో చక్కర్లు కొట్టడంతో పార్టీలోనే కొంత విభేదాలు ఏర్పడ్డాయి
వాటన్నిటికీ మరోసారి చెక్కు పెట్టడం జరిగింది.డోర్నకల్ బాదుషా రెడ్యానాయక్ అని మరోసారి రుజువయింది,డోర్నకల్ లోని కొందరి రెడ్యాకు టికెట్ రాదని చర్చలు విపరీతంగా జరిగాయి,
గెలుపే తన ఆయుధంగా డోర్నకల్ ప్రజలే దేవుళ్ళుగా భావిస్తున్న డోర్నకల్ అలుపు ఎరగని ప్రజా నాయకుని అధిష్టానం మళ్లీ రెడ్యా కి టికెట్ వరించింది.తాను చేస్తున్న అభివృద్ధికి ప్రతిపక్షాలు కూడా అంతులేకుండా పోయాయి.
నాకు ఎవరు ప్రతిపక్షాలు లేరు నా పార్టీలో నాకు ప్రతి పక్షాలు ఏర్పడ్డాయని క్లుప్తంగా ఆత్మీయ సమ్మేళనం ప్రజాసభలోనే పలికారు.
డోర్నకల్ నియోజకవర్గం లోని ఎవరు ఏమనుకున్నా నా పని నేను చేసుకుంటా పోతున్నానని దృడ సంకల్పంతో రెడ్యానాయక్ ప్రజల ఆశీస్సులతో ప్రజా సేవ చేసుకునే భాగ్యం మల్లా దక్కిందని ప్రజలు సంతోషంగా చర్చించుకుంటున్నారు.
అంతేకాకుండా మరీ కొంతమంది పార్టీ శ్రేణులైతే మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కే డోర్నకల్ టికెట్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని కొంతమంది సీనియర్ పార్టీ నాయకులు బాహాటంగానే ప్రచారం జోరుగా చేశారు.
దీంతో పార్టీ క్యాడర్లో కొంత నిరాశ నిసృహ ఏర్పడినప్పటికీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్న పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నియోజకవర్గ గెలుపుకై కృషి చేస్తామని నాయకులు చెప్పుకొచ్చారు.దీంతో నియోజకవర్గంలో వస్తున్న వదంతులతో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే అంశం నివురు గప్పిన నిప్పులా మారింది.
ఈ పరిణామాల తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాత్రం ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా నియోజకవర్గ ప్రజల ను అన్ని అన్నివేళలా కంటికి రెప్పలా కాపాడుకుంది తానేనని, నీయోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది,నీయోజకవర్గ ప్రజల దీవెనలు తనకే మెండుగా ఉన్నాయని,డోర్నకల్ టికెట్ తనకే వస్తుందని నమ్మకంతో గత కొన్ని రోజులుగా నియోజకవర్గం లోని ప్రజల మన్నన ల కోసం క్యాంపెనింగ్ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నీయోజకవర్గంలోని పలు గ్రామాల్లోని ప్రజలు అభివృద్ధి జరగలేదని,ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదని రెడ్యా పర్యటనలో నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాత్రం తాను పని తాను చేసుకుంటూ పోతూ, నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంఖు స్థాపనలు చేపట్టారు.
నియోజకవర్గంలో రెడ్యానాయక్ నిరసన సెగలు
ఎదురవడం,గతంలో సత్యవతి రాథోడ్ డోర్నకల్ టికెట్ కోసం పరోక్షంగా మాట్లాడటం, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పేరును కొంతమంది అనుచరులు ఎమ్మెల్యే టికెట్ ఆమెకే వస్తుందని తెరమీదకి తీసుకురావడంతో నియోజకవర్గంలో పార్టీ ముఖ్య నాయకుల సైతం అంతర్మదంలో పడినట్లు చర్చ జోరుగా సాగుతూ వచ్చింది.
జరుగుతున్న అనునుమాన పరిణామాల,నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ 2023 ఎన్నికల బరిలో రాష్ట్రంలో 115 మంది ఎమ్మెల్యేల అభ్యర్థుల తోలి జాబితా ప్రకటించడం అందులో నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు టికెట్ కన్ఫామ్ కావడంతో నియోజకవర్గంలో టికెట్ పై వస్తున్న వదంతులు, పలు అనుమానాలకు తెరపడినట్లయింది. దీంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపినెట్లైంది.
సంబరాలు జరుపుకున్న బిఆర్ఎస్ నేతలు
డోర్నకల్ టికెట్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కే కన్ఫామ్ కావడంతో ఆయా పార్టీ శ్రేణులు,నాయకులు మండల కేంద్రంలోని ఆలయ సెంటర్లో టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.
జై కేసీఆర్,జై రెడ్యా నాయక్ ..అంటూ నినాదాలు చేశారు..ఈ కార్యక్రమంలో మండల నాయకులు తోటలాలయ్య, బజ్జూరి పిచ్చిరెడ్డి, ముడ్ల రమేష్, రవి నాయక్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు..