Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వీఆర్ఏ ప్రోసిడింగ్ ఆర్డర్లు అవకతవకల పై గ్రీవెన్స్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేత

తల్లిదండ్రులు బతికుండగా వయసు దాటకముందే ప్రోసిడింగ్ ఆర్డర్లు.

గతంలో కురవి తాసిల్దార్ గా విజయ్ కుమార్ చేసిన అక్రమ ప్రొసీడింగ్ ఆర్డర్లు పై వెంటనే విచారణ జరిపించాలి.

కాంగ్రెస్ పార్టీ దళిత సీనియర్ నాయకులు మిరియాల లచ్చయ్య.

కురవి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కామిండ్ల వీరన్న.

కురవి,నిజంచెపుతాం,ఆగస్టు,21:

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని వీఆర్ఏల పదోన్నతి నియామకాల్లో వారసత్వ అక్రమ ప్రోసిడింగ్ ఆర్డర్ కాపీ అవకతవకల పై తల్లిదండ్రులు బతికి ఉండి, వయసు దాటకముందే ప్రోసిడింగ్ ఆర్డర్ కాపీ ఇచ్చిన.

గతంలో పని చేసిన కురవి తహశీల్దార్ విజయ్ కుమార్ పై విచారణ జరిపించాలి. గ్రీవెన్స్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ కి వినతి పత్రం అందజేసిన,కాంగ్రెస్ పార్టీ దళిత సీనియర్ నాయకులు మిరియాల లచ్చయ్య,కురవి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కామిండ్ల వీరన్న.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… వీఆర్ఏల గత 3 సంవత్సరాల క్రితం పనిచేసిన తహశీల్దార్ విజయ్ కుమార్ కురవి, బలపాల,అయ్యగారిపల్లి, రాజోలు,ఉప్పరగూడెం,సిరోల్ గ్రామానికి చెందిన వ్యక్తులకు వాళ్ళ తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండి వయస్సు దాటకముందే అక్రమంగా తహశీల్దార్ కు కొన్ని డబ్బులు ఇచ్చే అక్రమంగా ప్రొసీడింగ్ ఆర్డర్లు పొందారని అన్నారు.

మహబూబాబాద్ డివిజన్ అధికారి ఆర్డీవో ని ఎంక్వైరీ గా కురవి మండలానికి పంపించి విచారణ జరిపి వారిని సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.