బీఎస్పీ తీర్థం పుచ్చుకున్న….. పాల్వాయి నగేష్
బిఎస్పి స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిక.
తుంగతుర్తి లో బి ఆర్ఎస్ తో…. ఇక యుద్ధమే.
హైదరాబాద్ ఆగస్టు 22 నిజం చెపుతాం న్యూస్
తుంగతుర్తి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా 2018లో పోటీ చేసిన తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన పాల్వాయి నగేష్, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేసి, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ, ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ, అనతి కాలములోనే రాజకీయ నాయకుడిగా పేరుగాంచి, సోమవారం బహుజనుల తోనే రాజ్యాధికారం సాధిస్తామని లక్ష్యముతో, బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో బహుజనులందరినీ ఏకం చేసి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీతో ఇక యుద్ధమే అని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై పోరాడుతామని అన్నారు ఈ అవకాశం కల్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, నియోజకవర్గ ప్రజలంతా నన్ను మంచి మనసుతో ఆశీర్వదించాలని కోరారు. శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, హర్షం వ్యక్తం చేశారు….