Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శించుకున్న చిన్న జీయర్ స్వామి

*స్వర్ణ తాపడానికి 5 కిలోల బంగారం అందజేసిన జూపల్లి దంపతులు

యాదగిరిగుట్ట:ఆగస్టు21(నిజంచెపుతాం)యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి,మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు,శ్రీ కుమారి దంపతులు శ్రావణమాస సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు.

వై టి డి ఏ వైస్ చైర్మన్ కిషన్ రావు,ఈవో గీతారెడ్డి ఆలయ మర్యాదలతో చిన్న జీయర్ స్వామి వారికి స్వాగతం పలికారు.

అనంతరం ప్రధాన ఆలయంలో కొలువైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జూపల్లి రామేశ్వరరావు 5 కిలోల బంగారాన్ని ఈవో గీతారెడ్డికి అందించారు. బాలాలయ స్థలంలో సొంత నిధులతో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో అనువంశికధర్మకర్త నరసింహమూర్తి,డీఏఓవో భాస్కర శర్మ,ఆలయ అధికారులు పాల్గొన్నారు.