Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బిఆర్ఎస్ మహబూబాబాద్ అభ్యర్థి శంకర్ నాయక్

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, ఆగస్టు 21,( నిజ న్యూస్):

మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టడానికి ఉత్సాహంతో ఉరకలేస్తున్న శంకర్ నాయక్. పలు ఊహాగానాలకు తెర దించుతూ శంకర్ నాయక్ కె, కెసిఆర్ టికెట్ కేటాయించారు.

మహబూబాబాద్ నియోజకవర్గ మొత్తం శంకర్ నాయక్కు టికెట్ కేటాయించడం పట్ల నాయకులు, కార్యకర్తలు బాంబుల మోతలతో దద్దరిల్లిస్తున్నారు.

గత పది సంవత్సరాల లో నియోజకవర్గానికి శంకర్ నాయక్ చేసిన సేవకు ఫలితం దక్కిందని కార్యకర్తలు ఆనంద పడుతున్నారు.

గత పది సంవత్సరాల క్రితం మహబూబాబాద్ ఎలా ఉంది?. ఇప్పుడు ఎలా ఉంది?. అని పలు సందర్భాలలో శంకర్ నాయక్ ప్రసంగించడం గమనార్హం.

పట్టణంలో 300 పడకల ఆసుపత్రి మంజూరు, జిల్లా సమీకృత కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, జిల్లా ఎస్పీ కార్యాలయం, పట్టణానికి సెంట్రల్ లైటింగ్, హార్టికల్చర్ కాలేజీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.

శంకర్ నాయక్ పై ఎన్నో విమర్శలు చేశారు. ఈసారి టికెట్ రాదని స్వపక్షమే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. శంకర్ నాయక్ ని భూ కబ్జాదారునిగా, అవినీతిపరునిగా, ఎన్ని నిందలు వేసిన ఎవరు కూడా ఒక్కటైనా నిరూపించలేకపోయారు.

రాష్ట్ర అధిష్టానం కూడా పదవిలో ఉన్నప్పుడు విమర్శలు రావడం సహజమని కొట్టిపారేసింది. ఎట్టకేలకు అధికార పార్టీ అభ్యర్థిగా బానోతు శంకర్ నాయక్ కు అధిష్టానం టికెట్ ఇవ్వడంతో సస్పెన్షన్కు తెర పడింది. ఇక ఎన్నికల గోదాలో శంకర్ నాయక్.